యేసుప్రభువు యెరూషలేము

Yesuprabhuvu Yerooshalemu

Telugu by గేరా ప్రేమయ్య • andhra-kraisthava-keerthanalu

యేసుప్రభువు యెరూషలేము - ప్రవేశించిన విధము = భాసురముగ తన

Yesuprabhuvu Yerooshalemu - Praveshinchina Vidhamu = Bhaasuramuga Thana

మహిమ చూడగా - జేసెను ఆ దినము ||యేసు||

Mahima Choodagaa - Jesenu Aa Dinamu ||Yesu||

1. . భారవాహక గార్థభమెక్కి - బాహాటముగాను = బయలుదేరెను జేజేలనగా

1. . Bhaaravaahaka Gaarthabhamekki - Baahaatamugaanu = Bayaluderenu Jejelanagaa

- ప్రియమొప్పగతాను ||యేసు||

- Priyamoppagathaanu ||Yesu||

2. పాడుచు - గంతులు వేయుచు - అట్టహాసముతో = కొట్టుచు

2. Paaduchu - Ganthulu Veyuchu - Attahaasamutho = Kottuchu

కరతాళములను పెద్దగా - కూరిమి చూపిరిగా ||యేసు||

Karathaalamulanu Peddagaa - Koorimi Choopirigaa ||Yesu||

3. పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు - ఉల్లాసముతోను = చల్లని ప్రభువని

3. Pillalu Peddalu Mellaga Bovuchu - Ullaasamuthonu = Challani Prabhuvani

జయములు గొట్టిరి - సంతోషముతోను ||యేసు||

Jayamulu Gottiri - Santhoshamuthonu ||Yesu||

4 కొందరు మూర్చులు - తొందర చేయుచు - ముందుకు వచ్చిరిగా = అందరు

4 Kondaru Moorchulu - Thondara Cheyuchu - Munduku Vachchirigaa = Andaru

మానిన - అరచును రాళ్లని - అపుడా ప్రభువనగా||యేసు||

Maanina - Arachunu Raallani - Apudaa Prabhuvanagaa||Yesu||

5. _ చిగురుటాకు చెట్ల కొమ్మలను - సొగసుగ మార్గములో = బాగుగ పరిరచిరి

5. _ Chigurutaaku Chetla Kommalanu - Sogasuga Maargamulo = Baaguga Parirachiri

- భక్తిని చూపిరి - సాగుచు జనులంతా ||యేసు||

- Bhakthini Choopiri - Saaguchu Janulanthaa ||Yesu||

6. యెరూషలేము - గతిగని ప్రభువు - ఏద్చెను ఎలుగెత్తి = మరియు యెరుషలేం

6. Yerooshalemu - Gathigani Prabhuvu - Edchenu Elugeththi = Mariyu Yerushalen

దేవాలయమును - పరిశుభ్రత చేసె ||యేసు||

Devaalayamunu - Parishubhratha Chese ||Yesu||

7. మనలోనున్న పాపము లెల్ల - మనుపును ఆ ప్రభువే = ఘనకృపశాంతులు

7. Manalonunna Paapamu Lella - Manupunu Aa Prabhuve = Ghanakrupashaanthulu

- గల్గించియు మరి- ననయము బ్రోచునిలన్ ||యేసు||

- Galginchiyu Mari- Nanayamu Brochunilan ||Yesu||

Related Telugu Christian Songs