యేసుని స్తుతియించువారు
Yesuni Sthuthiyinchuvaaru
యేసుని స్తుతియించువారు – నిత్యజీవము పొందెదరు
Yesuni Sthuthiyinchuvaaru – Nithyajeevamu Pondedaru
ఆనందముతో దినదినము – సంతోషముగ నుందురు ||యే||
Aanandamutho Dinadinamu – Santhoshamuga Nunduru ||Ye||
చీకటి నుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు
Cheekati Nundi Velugunaku – Maranamunundi Jeevamuku
చేయివిడువక తనతో కూడ యేసే నడిపించును
Cheyividuvaka Thanatho Kooda Yese Nadipinchunu
ఆహా హల్లెలూయ (4) ||యే||
Aahaa Hallelooya (4) ||Ye||
నడిసంద్రములో పయనించిన – నట్టడవులలో నివసించిన
Nadisandramulo Payaninchina – Nattadavulalo Nivasinchina
ఎన్నడు మరువక ఎడబాయకను యేసే తోడుండును
Ennadu Maruvaka Edabaayakanu Yese Thodundunu
ఆహా హల్లెలూయ (4) ||యే||
Aahaa Hallelooya (4) ||Ye||
చీకు చింతలు కలిగినను – చెరలో దు:ఖము కలిగినను
Cheeku Chinthalu Kaliginanu – Cheralo Du:Khamu Kaliginanu
కనురెప్పవలె కాపాడి – యేసే నడిపించును
Kanureppavale Kaapaadi – Yese Nadipinchunu
ఆహా హల్లెలూయ (4) ||యే||
Aahaa Hallelooya (4) ||Ye||
వాడబారని ఆకువలె – దిన దినము బలమొందెదరు
Vaadabaarani Aakuvale – Dina Dinamu Balamondedaru
జీవజలముల నదియొడ్డున్న వృక్షమువలె ఎదుగుదురు
Jeevajalamula Nadiyoddunna Vrukshamuvale Eduguduru
ఆహా హల్లెలూయ (4) ||యే||
Aahaa Hallelooya (4) ||Ye||