యేసుని కొరకై యిల

Yesuni Korakai Yila

Telugu by రావి జాన్‌ సుందరరావు • andhra-kraisthava-keerthanalu

యేసుని కొరకై యిల జీవించెద

Yesuni Korakai Yila Jeevincheda

భాసురముగ నే ననుదినము (2)

Bhaasuramuga Ne Nanudinamu (2)

దోసములన్నియు బాపెను మోక్ష

Dosamulanniyu Baapenu Moksha

ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||

Nivaasamuna Prabhu Jerchunugaa ||Yesuni||

1. నాశనకరమగు గుంటలోనుండియు

1. Naashanakaramagu Guntalonundiyu

మోసకరంబగు యూబినుండి (2)

Mosakarambagu Yoobinundi (2)

నాశచే నిలపై కెత్తెను నన్ను పి

Naashache Nilapai Ketthenu Nannu Pi

శాచి పథంబున దొలగించెన్‌ ||యేసుని||

Shaachi Pathambuna Dolaginchen ||Yesuni||

2. పలువిధముల పాపంబును జేసితి

2. Paluvidhamula Paapambunu Jesithi

వలదని ద్రోసితి వాక్యమును (2)

Valadani Drosithi Vaakyamunu (2)

కలుషము బాపెను కరుణను బిలిచెను

Kalushamu Baapenu Karunanu Bilichenu

సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||

Siluvalo Nannaakarshinchen ||Yesuni||

3. ఆలయక సొలయక సాగిపోదును

3. Aalayaka Solayaka Saagipodunu

వెలయగ నా ప్రభు మార్గములన్‌ (2)

Velayaga Naa Prabhu Maargamulan (2)

కలిగెను నెమ్మది కలువరిగిరిలో

Kaligenu Nemmadi Kaluvarigirilo

విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని||

Viluvagu Rakthamu Chindinchina Prabhu ||Yesuni||

4 శోధన బాధలు శ్రమలిల కల్గిన

4. Shodhana Baadhalu Shramalila Kalgina

ఆదుకొనును నా ప్రభువనిశం (2)

Aadukonunu Naa Prabhuvanisham (2)

వ్యాధులు లేములు మరణము వచ్చిన

Vyaadhulu Lemulu Maranamu Vachchina

నాథుడే నా నిరీక్షణగున్ ||యేసుని||

Naathude Naa Nireekshanagun ||Yesuni||

5. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు

5. Buddhi Vignyaana Sarvasampadalu

గుప్తమై యున్నవి ప్రభునందు (2)

Gupthamai Yunnavi Prabhunandu (2)

అద్భుతముగ ప్రభు - వన్నియునొసగి

Adbhuthamuga Prabhu - Vanniyunosagi

దిద్దును నా బ్రతుకంతటిని ||యేసుని||

Diddunu Naa Brathukanthatini ||Yesuni||

6. అర్చించెను దన ప్రాణము నాకై

6. Archinchenu Dana Praanamu Naakai

రక్షించెను నా ప్రియ ప్రభువు (2)

Rakshinchenu Naa Priya Prabhuvu (2)

అర్చింతును నా యావజ్జీవము

Archinthunu Naa Yaavajjeevamu

రక్షకు డేసుని సేవింప ||యేసుని||

Rakshakudesuni Sevimpa ||Yesuni||

7. ప్రభునందానందింతును నిరతము

7. Prabhunandaanandinthunu Nirathamu

ప్రార్ధన విజ్ఞాపనములతో (2)

Praardhana Vignyaapanamulatho (2)

విభుడే దీర్చును యిల నా చింతలు

Vibhude Deerchunu Yila Naa Chinthalu

అభయముతో స్తుతియింతు ప్రభున్‌ ||యేసుని||

Abhayamutho Sthuthiyinthu Prabhun ||Yesuni||

8. యౌవన జనమా - యిదియే సమయము

8. Youvana Janamaa - Yidiye Samayamu

యేసుని చాటను రారండి (2)

Yesuni Chaatanu Raarandi (2)

పావన నామము పరిశుద్ధ నామము

Paavana Naamamu Parishuddha Naamamu

జీవపు మార్గము ప్రచురింపన్‌ ||యేసుని||

Jeevapu Maargamu Prachurimpan ||Yesuni||

Related Telugu Christian Songs