యేసుని భజియింపవే మనసా

Yesuni Bhajiyimpave Manasaa

Telugu by రావూరి లక్ష్మయ్య • andhra-kraisthava-keerthanalu

యేసుని భజియింపవే మనసా - నీ దోసములు చనం - జేసి కృపతోం బ్రోచునే మనసా

Yesuni Bhajiyimpave Manasaa - Nee Dosamulu Chanam - Jesi Krupathom Brochune Manasaa

వాసి కెక్కిన క్రీస్తు మోక్షని - వాసిగా కింక వేరేలేరని

Vaasi Kekkina Kreesthu Mokshani - Vaasigaa Kinka Verelerani

దోసిలొగ్గి నుతించితే నిను - ట్రోసివేయండు దోసకారని ||యేసు||

Dosiloggi Nuthinchithe Ninu - Trosiveyandu Dosakaarani ||Yesu||

1. ఏటికే నీ కీదురాశలు - నీ - కెప్పుడును చెవి - నాటవుగ ప్రభు యేసు వాక్యములు

1. Etike Nee Keeduraashalu - Nee - Keppudunu Chevi - Naatavuga Prabhu Yesu Vaakyamulu

వాటముగ నా తుది దినమున - నీటుమోరంగ నిత్యజీవ కిరీటమును నీకిత్తు నని తన

Vaatamuga Naa Thudi Dinamuna - Neetumoranga Nithyajeeva Kireetamunu Neekiththu Nani Thana

నోటం బల్మిన మాట దప్పండు ||యేసు||

Notam Balmina Maata Dappandu ||Yesu||

2. ఖండనగ నిను చెండియాడండు - యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతండితండు

2. Khandanaga Ninu Chendiyaadandu - Yellappudundana Mithrudani Rakshinchu Nathandithandu

అండంబాయక నిన్ను ప్రతి దిన - గండములను హరించునని నీ

Andambaayaka Ninnu Prathi Dina - Gandamulanu Harinchunani Nee

వుండ గోరిన నిండు నెమ్మది - దండిగ నీకుండం జెప్పును ||యేసు||

Vunda Gorina Nindu Nemmadi - Dandiga Neekundam Jeppunu ||Yesu||

3. లోక సైతాను దుర్భోధలు - నీ వాలింపక యా - లోకరక్షకుని సుబోధలు

3. Loka Saithaanu Durbhodhalu - Nee Vaalimpaka Yaa - Lokarakshakuni Subodhalu

ఏక మనసుతో రాత్రింబగలు పరాకులేకను గాచు నా ప్రభు

Eka Manasutho Raathrimbagalu Paraakulekanu Gaachu Naa Prabhu

రాకడను నీవెజింగినను పరలోకశుభ సుఖసౌఖ్య మొసంగును ||యేసు||

Raakadanu Neevejinginanu Paralokashubha Sukhasaukhya Mosangunu ||Yesu||

4. వంచనలు మది నుంచకే మనసా - నీ దుర్గుణము తల ద్రుంచి ప్రభుని సేవింపవే మనసా

4. Vanchanalu Madi Nunchake Manasaa - Nee Durgunamu Thala Drunchi Prabhuni Sevimpave Manasaa

అంచితముగా క్రీస్తు డీప్రపంచ జనుల భవాబ్ధీనావగ

Anchithamugaa Kreesthu Deeprapancha Janula Bhavaabdheenaavaga

నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా ||యేసు||

Nenchi Nee Bhavabhaara Mathanipai Nunchi Sathamu Praarthinchu Manasaa ||Yesu||

5. నిన్ను పాప బంధముల నుండి - రక్షించుటకు సర్వోన్నతుని కుమారుడై వెలసి

5. Ninnu Paapa Bandhamula Nundi - Rakshinchutaku Sarvonnathuni Kumaarudai Velasi

ఎన్నంగ నీవొందు దుఃఖములన్నిటిని తా ననుభవించెను

Ennanga Neevondu Duhkhamulannitini Thaa Nanubhavinchenu

విన్న తక్షణ మేసుక్రీస్తుని - విశ్వసించి సుఖించు మనసా ||యేసు||

Vinna Thakshana Mesukreesthuni - Vishvasinchi Sukhinchu Manasaa ||Yesu||

Related Telugu Christian Songs