యేసు నీ సదాత్మ

Yesu Nee Sadaathma

Telugu by ఎలిజబెత్‌ కాడ్నర్‌ • andhra-kraisthava-keerthanalu

1. యేసు, నీ సదాత్మ వృష్టి

1. Yesu, Nee Sadaathma Vrushti

భక్తు లెల్లవారిపై

Bhakthu Lellavaaripai

నీవు కుమ్మరింపంగాను

Neevu Kummarimpanggaanu

నాపైం గుమ్మరించుమీ.

Naapain Gummarinchumee.

|| నన్నునున్‌ , నన్ను నున్‌

|| Nannunun , Nannu Nun

నన్నాశీర్వదించుమీ ||

Nannaasheervadinchumee ||

2. తండ్రి, నన్ను దాంటవద్దు

2. Thandri, Nannu Daantavaddu

పాపి నంచు వేండెదన్‌

Paapi Nanchu Vendedan

నీ మన్నింపు నీదు కృప

Nee Mannimpu Needu Krupa

నా కనుగ్రహించుమీ

Naa Kanugrahinchumee

3. రక్షకా, నన్‌ దాంటి పోకు

3. Rakshakaa, Nan Daanti Poku

నేను నిన్ను నమ్మితిన్‌

Nenu Ninnu Nammithin

నీదు దయ పూర్తిగాను

Needu Daya Poorthigaanu

నాపైం గుమ్మరించుమీ.

Naapain Gummarinchumee.

4. పావనాత్మ, దాంటి పోకు

4. Paavanaathma, Daanti Poku

నేను గుడ్డివాండను

Nenu Guddivaandanu

జ్ఞానదృష్టి నాకు నిమ్ము

Gnaanadrushti Naaku Nimmu

నాకు దైవ శక్తి నీ.

Naaku Daiva Shakthi Nee.

5. మాఱునట్టి దైవ ప్రేమ.

5. Maarunatti Daiva Prema.

క్రీస్తు రక్త పుణ్యము

Kreesthu Raktha Punyamu

పావనాత్మ ప్రేరణంబు

Paavanaathma Preranambu

నిండుగాను బోయుమీ.

Nindugaanu Boyumee.

6. నన్ను దాంటిపోక యేసు

6. Nannu Daantipoka Yesu

నీకు సేవచేయ నా

Neeku Sevacheya Naa

హృదయంబును బంధించి

Hrudayambunu Bandhinchi

నన్నాశీర్వదించుమీ

Nannaasheervadinchumee

Related Telugu Christian Songs