యేసు నాయకుండ
Yesu Naayakunda
యేసు నాయకుండ - యెల్ల వేళలను నీ - దాసుల నేలుమయ్యా = మోసము
Yesu Naayakunda - Yella Velalanu Nee - Daasula Nelumayyaa = Mosamu
లన్నిటి - మునగద్రోతునని - బాసలు జేసిన - ప్రభుడవు నీవేగా ||యేసు||
Lanniti - Munagadrothunani - Baasalu Jesina - Prabhudavu Neevegaa ||Yesu||
1. రేయింబవలు మా - న్యాయము చెరిపెడి - మాయ పిశాచిని = త్రోయుమి
1. Reyimbavalu Maa - Nyaayamu Cheripedi - Maaya Pishaachini = Throyumi
దూరము - బాయక భక్తుల - జేరి విడువని బహుశ్రేష్ఠుడ నీవేగా ||యేసు||
Dooramu - Baayaka Bhakthula - Jeri Viduvani Bahushreshthuda Neevegaa ||Yesu||
2. హృదయము లోకము - మది పాపము మమ్ము - సతతము శ్రమ పెట్టును =
2. Hrudayamu Lokamu - Madi Paapamu Mammu - Sathathamu Shrama Pettunu =
సదయుండ మమ్మును - వదలక నిత్యము - మది తలపులలో - మహిమగ
Sadayunda Mammunu - Vadalaka Nithyamu - Madi Thalapulalo - Mahimaga
నేలుమి ||యేసు||
Nelumi ||Yesu||
3. కాపాడుమి మమ్ము - మాపు రేపు నీ - శ్రీ పాదము లొద్దను = ఏ
3. Kaapaadumi Mammu - Maapu Repu Nee - Shree Paadamu Loddanu = E
పాపములను ఏలకుండగ నీ - ప్రాపున బెంచుము - మాపాలకుడవో ||యేసు||
Paapamulanu Elakundaga Nee - Praapuna Benchumu - Maapaalakudavo ||Yesu||
4. మా కొరకై నీ - మేనును క్రానున - మేకులతో గొట్టగ - మానవు మహిమలు -
4. Maa Korakai Nee - Menunu Kraanuna - Mekulatho Gottaga - Maanavu Mahimalu -
మనుజుల కియ్యను - భానుడ రాజుగ - బ్రతికి లేచితివి ||యేసు||
Manujula Kiyyanu - Bhaanuda Raajuga - Brathiki Lechithivi ||Yesu||
5. చెరను చెరనుగా - మరి పట్టుక నీవు - పరమున కరిగితివే - వరముల
5. Cheranu Cheranugaa - Mari Pattuka Neevu - Paramuna Karigithive - Varamula
నిడితివి - ధరలో నరులకు - పరముడ నీ దయ మరువశక్యమా ||యేసు||
Nidithivi - Dharalo Narulaku - Paramuda Nee Daya Maruvashakyamaa ||Yesu||