యేసు నా సిలువ

Yesu Naa Siluva

Telugu by వంతగాని వరదేళి • andhra-kraisthava-keerthanalu

యేసు! నా సిలువ నెత్తి - యిప్పుడు నే - నీ సుమార్గముం బట్టితి = నా

Yesu! Naa Siluva Neththi - Yippudu Ne - Nee Sumaargamun Battithi = Naa

స్వజనము లనాదరంబునం - త్రోసినను పగజేసిన - నా సమస్తము నీవెగా

Svajanamu Lanaadarambunan - Throsinanu Pagajesina - Naa Samasthamu Neevegaa

యిక - నే సరకుగొన నేమియున్‌ ||యేసు||

Yika - Ne Sarakugona Nemiyun ||Yesu||

1. ఎన్ని శ్రమలు వచ్చిన - లోకపు టాశ - లన్ని భిన్నము నొందిన = నన్ను

1. Enni Shramalu Vachchina - Lokapu Taasha - Lanni Bhinnamu Nondina = Nannu

ఖిన్నునిజేయ నేరవు - సన్నుతుండును స్వర్గము - నన్ని నావైయున్న విగ నింక

Khinnunijeya Neravu - Sannuthundunu Svargamu - Nanni Naavaiyunna Viga Ningka

- నన్నుం గదుపున దెవ్వరు ||యేసు||

- Nannun Gadupuna Devvaru ||Yesu||

2. ఆపదల్ ననుం జుట్టినం - జేరుదు నే - నో పరాత్పర రొమ్మునం = బ్రావ

2. Aapadal Nanun Juttinan - Jerudu Ne - No Paraathpara Rommunan = Braava

కుండవు పతితుండై నీ - దాపు జేరిన వానికిన్‌ - దాప మాపుచు సంతసంబిడి

Kundavu Pathithundai Nee - Daapu Jerina Vaanikin - Daapa Maapuchu Santhasambidi

- ధన్యుం జేయుదు వీవెగా ||యేసు||

- Dhanyun Jeyudu Veevegaa ||Yesu||

3. నినుం బ్రేమించెడు తండ్రిని - నా యాత్మా - నిను రక్షించిన క్రీస్తును =

3. Ninun Breminchedu Thandrini - Naa Yaathmaa - Ninu Rakshinchina Kreesthunu =

గనుమునిన్నుం జొ -చ్చిన ప్రియాత్మను - ఘన త్రైకుని నిత్యమున్‌ - గొనుము

Ganumuninnun Jo -Chchina Priyaathmanu - Ghana Thraikuni Nithyamun - Gonumu

రక్షణ, పాపము చిం - తను విడిచి యిం కెన్నండున్‌ ||యేసు||

Rakshana, Paapamu Chin - Thanu Vidichi Yin Kennandun ||Yesu||

4. విశ్వాస కవచంబును - మేను నిడి - విజ్ఞాపనము చేయుము = శాశ్వతంబగు

4. Vishvaasa Kavachambunu - Menu Nidi - Vijnyaapanamu Cheyumu = Shaashvathambagu

రాజ్యమునకును - సదయుండో ప్రభువు నడుపు - విశ్వసితము లభించునట

Raajyamunakunu - Sadayundo Prabhuvu Nadupu - Vishvasithamu Labhinchunata

నీ - విన్నపము స్తుతి యౌనుగా ||యేసు||

Nee - Vinnapamu Sthuthi Yaunugaa ||Yesu||

Related Telugu Christian Songs