యేసు క్రీస్తుండు నిత్య
Yesu Kreesthundu Nithya
యేసు క్రీస్తుండు నిత్య దేవుండు - ఇట్టి నమ్ముండి మనుజులారా
Yesu Kreesthundu Nithya Devundu - Itti Nammundi Manujulaaraa
మోస మొందక మోక్షపతికింక - దాసులై బ్రతుకండి రండి ||యేసు||
Mosa Mondaka Mokshapathikinka - Daasulai Brathukandi Randi ||Yesu||
1. ఆరు దినములలోపలనే - యాకాశము భూలోకములను
1. Aaru Dinamulalopalane - Yaakaashamu Bhoolokamulanu
ప్రాకటముగం జేసి నాండు - ప్రకాశుండాయన ప్రజ్ఞవంతుండు ||యేసు||
Praakatamugam Jesi Naandu - Prakaashundaayana Prajnyavanthundu ||Yesu||
2. ఆది పురుషుని యాదిస్త్రీనింక - హస్తములతో నంటి చేసెను
2. Aadi Purushuni Yaadisthreeninka - Hasthamulatho Nanti Chesenu
మేదినిన్ ఫలవనములోన - సాధులై నివసింప నిచ్చెను ||యేసు||
Medinin Phalavanamulona - Saadhulai Nivasimpa Nichchenu ||Yesu||
3. వారలిద్దరు దేవునాజ్ఞను - కోరికలతో మీరినప్పుడు
3. Vaaraliddaru Devunaajnyanu - Korikalatho Meerinappudu
గారడీ పిశాచ తంత్రము - వారి పరమై పాపులైరి ||యేసు||
Gaaradee Pishaacha Thanthramu - Vaari Paramai Paapulairi ||Yesu||
4. వీరలందరు వారి సంతతి - వేరెలేరీ ధరణిలో
4. Veeralandaru Vaari Santhathi - Vereleree Dharanilo
దుష్మార్గులై దేవుని యాజ్ఞలు - మీరి రందరు నరక పాత్రులు ||యేసు||
Dushmaargulai Devuni Yaajnyalu - Meeri Randaru Naraka Paathrulu ||Yesu||
5. ఇంత పాపభరితులై కా - సంతసత్యము లేని నరుల
5. Intha Paapabharithulai Kaa - Santhasathyamu Leni Narula
నెంతగాం ప్రేమించెను తన - సొంత ప్రాణము బలిగం బెట్టెను ||యేసు||
Nenthagaam Preminchenu Thana - Sontha Praanamu Baligam Bettenu ||Yesu||
6. పాపమించుకలేని కరుణా - పావనుడు నరుండాయెను
6. Paapaminchukaleni Karunaa - Paavanudu Narundaayenu
శాపగ్రస్తులమైన మన - శాపములు తాంజేతం బూనెను ||యేసు||
Shaapagrasthulamaina Mana - Shaapamulu Thaanjetham Boonenu ||Yesu||
7. ఎన్నరాని బాధలొందుచు - పుణ్యరక్తము జిందెనిలను
7. Ennaraani Baadhalonduchu - Punyarakthamu Jindenilanu
ఎన్నండు నీలాటి ప్రేమ - వన్నెలేదో యన్నలారా ||యేసు||
Ennandu Neelaati Prema - Vanneledo Yannalaaraa ||Yesu||
8. మనలం బాపమునుండి బాపను - మనుజుడై మరణంబునొంది
8. Manalam Baapamunundi Baapanu - Manujudai Maranambunondi
మన ప్రభువే మూడవ దినంబున - మహినిలేచి పరము వెళ్లెను ||యేసు||
Mana Prabhuve Moodava Dinambuna - Mahinilechi Paramu Vellenu ||Yesu||