యేసు భజనయే మనలను

Yesu Bhajanaye Manalanu

Telugu by విలియం డాసన్ • andhra-kraisthava-keerthanalu

యేసు భజనయే మనలను ఆ సుగతికిం దీయు - జనులారా

Yesu Bhajanaye Manalanu Aa Sugathikim Deeyu - Janulaaraa

దాసజనులు జేయు పలు - దోసములు మోయు ||యేసు||

Daasajanulu Jeyu Palu - Dosamulu Moyu ||Yesu||

1. మేల కులశీల వ్రత - జాలాధిక మేల

1. Mela Kulasheela Vratha - Jaalaadhika Mela

చాల మన మేలాగునద - గాలావధిక గూల ||యేసు||

Chaala Mana Melaagunada - Gaalaavadhika Goola ||Yesu||

2. అక్షయ కరుణేక్ష భువన - రక్షణ ఖిల శిక్షా

2. Akshaya Karuneksha Bhuvana - Rakshana Khila Shikshaa

ధ్యక్ష బుధ పక్ష కృత - మోక్ష యను దీక్షన్ ||యేసు||

Dhyaksha Budha Paksha Krutha - Moksha Yanu Deekshan ||Yesu||

3. మాటికి మిన్నేటికి బో - నేటికి గాల్ నొవ్వ

3. Maatiki Minnetiki Bo - Netiki Gaal Novva

సూటిగ నరకోటి దురిత - వాటములను మోటు ||యేసు||

Sootiga Narakoti Duritha - Vaatamulanu Motu ||Yesu||

4. శ్రోత్రము యపవిత్ర నర చ - రిత్రలు వినంబోక

4. Shrothramu Yapavithra Nara Cha - Rithralu Vinamboka

మైత్రిని బరమాత్ముని కథ - మాత్రము విను మనుచున్ ||యేసు||

Maithrini Baramaathmuni Katha - Maathramu Vinu Manuchun ||Yesu||

5. మన జీవనమునకు మారుగ - తన ప్రాణము నిచ్చెన్

5. Mana Jeevanamunaku Maaruga - Thana Praanamu Nichchen

తన రక్తముచేం బావన మొనరించెను మనలన్ ||యేసు||

Thana Rakthamuchem Baavana Monarinchenu Manalan ||Yesu||

Related Telugu Christian Songs