యేసూ నిన్ జూతు
Yesoo Nin Joothu
1. యేసూ, నిన్ జూతు నిందుం దేటగా
1. Yesoo, Nin Joothu Nindun Detagaa
అగోచరార్థముల్ నే ముట్టుదున్
Agocharaarthamul Ne Muttudun
కృపన్ నేం బట్టుకొందు గట్టిగా
Krupan Nen Battukondu Gattigaa
నీ మీంద వేయుదున్ నా భారము.
Nee Meenda Veyudun Naa Bhaaramu.
2. నే దైవాహార మిందె తిందును
2. Ne Daivaahaara Minde Thindunu
ఆత్మీయ ద్రాక్షపాత్ర త్రాగుదున్
Aathmeeya Draakshapaathra Thraagudun
భూభారముల్ నేం బారవేయు దున్
Bhoobhaaramul Nen Baaraveyu Dun
క్షమా సౌఖ్యంబు గల్గుం క్రొత్తగా.
Kshamaa Saukhyambu Galgun Kroththagaa.
3. సంగీత భోజనాల కాలము
3. Sanggeetha Bhojanaala Kaalamu
ప్రభుండు నాకై బల్ల వేసెను
Prabhundu Naakai Balla Vesenu
విందారగించుచున్ నీ తోడి నా
Vindaaraginchuchun Nee Thodi Naa
మాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచుదున్.
Maadhurya Svalpa Maithrin Benchudun.
4. సాయం బీవే, వేరే నా కెందుకు
4. Saayan Beeve, Vere Naa Kenduku
వేరే చేమీంద నానుకొనను
Vere Chemeenda Naanukonanu
ప్రభూ, నిజంబుగా నిదే చాలును
Prabhoo, Nijambugaa Nide Chaalunu
నీ శక్తిలోనె బలం బుండున్
Nee Shakthilone Balan Bundun
5. పాపంబు నాది, నీతి నీదెగా
5. Paapambu Naadi, Neethi Needegaa
నేరంబు నాది శుద్ధి నీదెగా
Nerambu Naadi Shuddhi Needegaa
నీ రక్త నీతియే నా వస్త్రముల్
Nee Raktha Neethiye Naa Vasthramul
నా కాశ్రయంబు శాంతస్థితులు
Naa Kaashrayambu Shaanthasthithulu