యేహోవా నా బలమా
Yehovaa Naa Balamaa
యెహోవ నా బలమా – యదార్ధమైనది నీ మార్గం
Yehova Naa Balamaa – Yadaardhamainadi Nee Maargan
పరిపూర్ణమైనది నీ మార్గం – యెహొవా....
Paripoornamainadi Nee Maargan – Yehovaa....
నా శత్రువులు నను చుట్టినను – నరకపు పాశము లరికట్టినను
Naa Shathruvulu Nanu Chuttinanu – Narakapu Paashamu Larikattinanu
వరదవలె భక్తిహీనులు పొర్లిన – విడువక నను ఎడబాయని దేవా
Varadavale Bhakthiheenulu Porlina – Viduvaka Nanu Edabaayani Devaa
||యోహొవా||
||Yohovaa||
మరణపు టురులలో మరువక మొరలిడు – ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
Maranapu Turulalo Maruvaka Moralidu – Unnatha Durgamai Rakshana Shrunggamai
తన ఆలయములో నా మొర వినెను – అదరెను ధరణి భయకంపముచే
Thana Aalayamulo Naa Mora Vinenu – Adarenu Dharani Bhayakampamuche
||యోహొవా||
||Yohovaa||
నా దీపమును వెలిగించువాడవు – నా చీకటిని వెలుగుగ చేయును
Naa Deepamunu Veliginchuvaadavu – Naa Cheekatini Veluguga Cheyunu
జలరాశుల నుండి బలమైన చేతితో – వెలుపల జేర్చిన బలమైన దేవా
Jalaraashula Nundi Balamaina Chethitho – Velupala Jerchina Balamaina Devaa
||యోహొవా||
||Yohovaa||
పౌరుషముగల ప్రభు కోపింపగ – పర్వతముల పునాదులు పణికెను
Paurushamugala Prabhu Kopimpaga – Parvathamula Punaadulu Panikenu
తన నోట నుండి వచిన అగ్ని – దహించి వేసెను వైరుల నెల్ల
Thana Nota Nundi Vachina Agni – Dahinchi Vesenu Vairula Nella
||యోహొవా||
||Yohovaa||
మేఘములపై ఆయన వచ్చును – మేఘములను తన మాటుగ జేయును
Meghamulapai Aayana Vachchunu – Meghamulanu Thana Maatuga Jeyunu
ఉరుములు మెరుపులు మెండుగ జేసి – అపజయమిచ్చును అపవాదికిని
Urumulu Merupulu Menduga Jesi – Apajayamichchunu Apavaadikini
||యోహొవా||
||Yohovaa||
దయగల వారి పై దయచూపించును – కఠినుల యెడల వికటము జూపును
Dayagala Vaari Pai Dayachoopinchunu – Kathinula Yedala Vikatamu Joopunu
గర్విష్టుల యొక్క గర్వము నణచును – సర్వము నెరిగిన సర్వాధికారి
Garvishtula Yokka Garvamu Nanachunu – Sarvamu Nerigina Sarvaadhikaari
||యోహొవా||
||Yohovaa||
నా కాళ్ళను లేడి కాళ్ళుగ జేసి – ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
Naa Kaallanu Ledi Kaalluga Jesi – Eththaina Sthalamulo Shakthitho Nilipi
రక్షణ కేడెము నా కందించి – అక్షయముగ తన పక్షము జేర్చిన
Rakshana Kedemu Naa Kandinchi – Akshayamuga Thana Pakshamu Jerchina
||యోహొవా||
||Yohovaa||
యెహొవా జీవము గల దేవా – బహుగా స్తుతులకు అర్హుడనీవె
Yehovaa Jeevamu Gala Devaa – Bahugaa Sthuthulaku Arhudaneeve
అన్యజనులలో ధన్యత జూపుచు – హల్లెలూయ స్తుతిగానము చేసెద
Anyajanulalo Dhanyatha Joopuchu – Hallelooya Sthuthigaanamu Cheseda
||యోహొవా||
||Yohovaa||