యెహోవా మా తండ్రి
Yehovaa Maa Thandri
యెహోవా మా తండ్రి గాండ - యేసుండు మా యన్న గాండ = మహిమ
Yehovaa Maa Thandri Gaanda - Yesundu Maa Yanna Gaanda = Mahima
గల యిట్టి - వరుసం దెలిపెం గద మాతోడ ||యెహోవా||
Gala Yitti - Varusan Delipen Gada Maathoda ||Yehovaa||
1. మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్ మా స్నేహితులు = సాక్షాత్మారమై
1. Moksha Nagaru Maa Puttillu - Mukhya Doothal Maa Snehithulu = Saakshaathmaaramai
యున్నపుడు - లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||
Yunnapudu - Lakshyapetta Miha Baadhalaku ||Yehovaa||
2. అబ్రాహాము దావీదు మొదలై - నట్టి వర భక్తాగ్రేసరులే = శుభ్రముగ మా
2. Abraahaamu Daaveedu Modalai - Natti Vara Bhakthaagresarule = Shubhramuga Maa
చుట్టా లైనన్ - హర్షమింక మా కేమి కొదువ ||యెహోవా||
Chuttaa Lainan - Harshamingka Maa Kemi Koduva ||Yehovaa||
3. పేతు సకలాపోస్తుల్ - పేర్మిగల మా నిజ = *ఖ్యాతి సభలో
3. Pethu Sakalaaposthul - Permigala Maa Nija = *Khyaathi Sabhalo
మే మున్నప్పుడు - ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||
Me Munnappudu - Ghanathalika Maakemi Velithi ||Yehovaa||
4, తనువు బలిపెట్టెను మా యన్న - తప్పు ల్విడం గొట్టెను మా తండ్రి =
4, Thanuvu Balipettenu Maa Yanna - Thappu Lvidan Gottenu Maa Thandri =
మనసులో సాక్ష్యమిట్లున్న - మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||
Manasulo Saakshyamitlunna - Manuju Letlannanu Maa Kemi ||Yehovaa||
5. పరమ విభు జీవగ్రంథములోం - బ్రభుని రక్తాక్షరముద్రితమె = చిరముగా
5. Parama Vibhu Jeevagranthamulon - Brabhuni Rakthaaksharamudrithame = Chiramugaa
నుండు మా పేరు - చెజుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||
Nundu Maa Peru - Chejupu Betteduvaa Ringkevaru ||Yehovaa||
6. కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని = పరమ ఫలముల్
6. Karamulatho Nanta Raani - Kannulaku Gocharamu Gaani = Parama Phalamul
మా కున్నప్రుడు - సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||
Maa Kunnaprudu - Saraku Gona Mikkadi Lemulaku ||Yehovaa||