విశ్వాసమే విజయము

Vishvaasame Vijayamu

Telugu by మురారి దావీదు • andhra-kraisthava-keerthanalu

విశ్వాసమే విజయము - విను ప్రియుడా య - విశ్వాస మపజయము =

Vishvaasame Vijayamu - Vinu Priyudaa Ya - Vishvaasa Mapajayamu =

విశ్వాసాయుతమైన - విసుకని సుకార్యములే - విశ్వాసవంతునికి - విజయ

Vishvaasaayuthamaina - Visukani Sukaaryamule - Vishvaasavanthuniki - Vijaya

మొసంగును నిజము ॥విశ్వాసమే॥

Mosanggunu Nijamu ॥Vishvaasame॥

1. భక్తు డందు వలననే - (బ్రతుకును మరియు - శక్తినొంది నిల్చును =

1. Bhakthu Dandu Valanane - (Brathukunu Mariyu - Shakthinondi Nilchunu =

యుక్తముగ వర్తించి - యుర్విని జయించి - ముక్తినొందున టంచు - రక్తిగాం

Yukthamuga Varthinchi - Yurvini Jayinchi - Mukthinonduna Tanchu - Rakthigaan

బాడుదును ॥విశ్వాసమే॥

Baadudunu ॥Vishvaasame॥

2. మంచి పేరు నొందును - సాతాను నెది- రించి విజయ మొందును =

2. Manchi Peru Nondunu - Saathaanu Nedi- Rinchi Vijaya Mondunu =

మించిన బాధ ల్ల - హించి జయించును - నంచిత మరణము - నానంద

Minchina Baadha Lla - Hinchi Jayinchunu - Nanchitha Maranamu - Naananda

ముగంగాంచు ॥విశ్వాసమే॥

Muganggaanchu ॥Vishvaasame॥

3. (ప్రవిమల మొందెదము - పాపమునుండి - పరిహరింపంబడుదుము =

3. (Pravimala Mondedamu - Paapamunundi - Pariharimpambadudumu =

అవి రతమును మనము - నాశ్చర్యముగ ఘనము - భువియందున్‌ దివియందున్‌

Avi Rathamunu Manamu - Naashcharyamuga Ghanamu - Bhuviyandun Diviyandun

- బుధులతో నొందుదుము ॥విశ్వాసమే॥

- Budhulatho Nondudumu ॥Vishvaasame॥

4. నీతిమంతుల మౌదుము - నిశ్చయము ప్ర- ఖ్యాతి బోధను నేర్తుము = ఆ

4. Neethimanthula Maudumu - Nishchayamu Pra- Khyaathi Bodhanu Nerthumu = Aa

తండ్రి దత్తముల - నన్ని యార్జించుచు - యాతని సుభద్రములో - ననయ

Thandri Daththamula - Nanni Yaarjinchuchu - Yaathani Subhadramulo - Nanaya

ముందుము నిజము ॥విశ్వాసమే॥

Mundumu Nijamu ॥Vishvaasame॥

5. పరిపూర్ణ విశ్వాసమే - క్రియలతో నున్న - మరి మంచి విశ్వాసమే =

5. Paripoorna Vishvaasame - Kriyalatho Nunna - Mari Manchi Vishvaasame =

ధరయందున్‌ బరమందున్‌ - ధన్యాత్మునిగం జేయున్‌ - సరగు నద్దానినే -

Dharayandun Baramandun - Dhanyaathmunigan Jeyun - Saragu Naddaanine -

సంపాదించుము ప్రియుడా ॥విశ్వాసమే॥

Sampaadinchumu Priyudaa ॥Vishvaasame॥

Related Telugu Christian Songs