విశ్వాస ఫలితములు

Vishvaasa Phalithamulu

Telugu by మురారి దావీదు • andhra-kraisthava-keerthanalu

విశ్వాస ఫలితములు - విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా = విశ్వాస

Vishvaasa Phalithamulu - Vishadammugaa Neeku Vivarinthu Vinu Kraisthavaa = Vishvaasa

వంతునికి - విశ్వమ్ములోపల మ - వశ్యమ్మొదవు కస్తవా ॥విశ్వా॥

Vanthuniki - Vishvammulopala Ma - Vashyammodavu Kasthavaa ॥Vishvaa॥

1. ఫలములన్నిటి లోన - ప్రాముఖ్యమైనట్టి - ఫలమది పాప క్షమమే = విలువైన

1. Phalamulanniti Lona - Praamukhyamainatti - Phalamadi Paapa Kshamame = Viluvaina

యీ ఫలము - గలుగు నరునికి ముక్తి - దొలగ దతనికి క్షేమమే ॥విశ్వా॥

Yee Phalamu - Galugu Naruniki Mukthi - Dolaga Dathaniki Kshemame ॥Vishvaa॥

2. దానములలోను ప్ర- ధానమనబడు సమా - ధానమును గల్లించును= మాని

2. Daanamulalonu Pra- Dhaanamanabadu Samaa - Dhaanamunu Gallinchunu= Maani

తమ్ముగ సమా - ధానమును భువిదివుల - మహితుతో గల్లించును ॥విశ్వా॥

Thammuga Samaa - Dhaanamunu Bhuvidivula - Mahithutho Gallinchunu ॥Vishvaa॥

3. నరక పాత్రులమైన - నావంటి నీవంటి - దురిత జీవుల కెల్లను =

3. Naraka Paathrulamaina - Naavanti Neevanti - Duritha Jeevula Kellanu =

గొబితలన్నియు దీర్చ = నిరత జీవము నియ్య - నిశ్చయమ్మిది చెల్లును ॥ విశ్వా!

Gobithalanniyu Deercha = Niratha Jeevamu Niyya - Nishchayammidi Chellunu ॥ Vishvaa!

4. ముత్తెమ్మునకు వలెనె - మురికి గప్పంగబడిన - చిత్తమును చిత్రవిధిగా =

4. Muththemmunaku Valene - Muriki Gappanggabadina - Chiththamunu Chithravidhigaa =

రత్నమువలె మిగుల - రంజిల్లం జేసెడి ప-విత్రాత్మ మనకొదవుగా ॥విశ్వా॥

Rathnamuvale Migula - Ranjillan Jesedi Pa-Vithraathma Manakodavugaa ॥Vishvaa॥

ర్‌. _మేరలేని దోష - కారులమై ప్రభుకు - దూరముగం దొలగియున్న = వారమగు

R. _Meraleni Dosha - Kaarulamai Prabhuku - Dooramugan Dolagiyunna = Vaaramagu

నను నిన్ను - చేరంగ బిలిచి కు - మారత్వమొసంగు నన్న ॥విశ్వా॥

Nanu Ninnu - Cherangga Bilichi Ku - Maarathvamosanggu Nanna ॥Vishvaa॥

6. సేగు క్రియలను జేసి - పోగొట్టుకొన్నట్టి - క్షేమ రాజ్యపు హక్కులన్‌ =

6. Segu Kriyalanu Jesi - Pogottukonnatti - Kshema Raajyapu Hakkulan =

బాగుగ మనకిచ్చి - బాంధవ్య మొనరించు - భగవంతునికి మనకున్‌ ॥విశ్వా॥।

Baaguga Manakichchi - Baandhavya Monarinchu - Bhagavanthuniki Manakun ॥Vishvaa॥।

7. విశ్వనాధుని గొప్ప - విశ్రాంతిలోను ప్ర- వేశము నాకు నొసంగుగా =

7. Vishvanaadhuni Goppa - Vishraanthilonu Pra- Veshamu Naaku Nosanggugaa =

విశ్వాస ఫలము లివి - నీ శాశ్వత రక్ష - ణాశ్రయం బిదియె విడకు ॥విశ్వా॥

Vishvaasa Phalamu Livi - Nee Shaashvatha Raksha - Naashrayan Bidiye Vidaku ॥Vishvaa॥

Related Telugu Christian Songs