వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును
Vintimayyaa Nee Svaramu Kantimayyaa Nee Roopamunu
పల్లవి:
Pallavi:
వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును (1)
Vintimayyaa Nee Svaramu - Kantimayyaa Nee Roopamunu (1)
ప్రియప్రభూ నిన్నుగాక - వేరెవరిని చూడము వినము (1)
Priyaprabhoo Ninnugaaka - Verevarini Choodamu Vinamu (1)
1. భక్తి మర్మము గొప్పది యెంతో - శరీరుడుగా మారిన దేవా, (2)
1. Bhakthi Marmamu Goppadi Yentho - Shareerudugaa Maarina Devaa, (2)
\దూతలకు కనబడితివి - లోకమందు నమ్మబడియున్న దేవా (2)
\Doothalaku Kanabadithivi - Lokamandu Nammabadiyunna Devaa (2)
2. భయపడవలదని దూతలు తెల్పె -మహా సంతోషకరమైన వార్త
2. Bhayapadavaladani Doothalu Thelpe -Mahaa Santhoshakaramaina Vaartha
రక్షకుడు పుట్టెనని - పరమందు మహిమ భువికి శాంతియనిరి
Rakshakudu Puttenani - Paramandu Mahima Bhuviki Shaanthiyaniri
3. నరరూప ధారివి యైతివి ప్రభువా - అద్భుతములు చేసియున్నావు,
3. Nararoopa Dhaarivi Yaithivi Prabhuvaa - Adbhuthamulu Chesiyunnaavu,
వేరెవ్వరు చేయలేరు - అద్భుతకరుడ ఘనత కలుగును గాక
Verevvaru Cheyaleru - Adbhuthakaruda Ghanatha Kalugunu Gaaka
4. మూగవారికి మాటలిచ్చితివి - గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి
4. Moogavaariki Maatalichchithivi - Gruddi Kuntini Baagu Jesithivi
మృతులను లేపితివి - పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా
Mruthulanu Lepithivi - Paraakrama Shaalivi Neeve O Prabhuvaa
5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి - అధికారముతో తిరిగి లేచితివి
5. Preminchi Prabhuvaa Praanamichchithivi - Adhikaaramutho Thirigi Lechithivi
మరణపు ముల్లు విరచితివి - నమాధి నిన్ను గెలువక పోయెను
Maranapu Mullu Virachithivi - Namaadhi Ninnu Geluvaka Poyenu
6. ఇహము నుండి పరమున కేగి - మా కొరకై నీవు రానై యున్నావు,
6. Ihamu Nundi Paramuna Kegi - Maa Korakai Neevu Raanai Yunnaavu,
ఆనందముతో కనిపెట్టెదము - మదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుమ్
Aanandamutho Kanipettedamu - Madiyande Nireekshana Kaligi Sthuthinthum