వినరే యపోస్తలుల కార్యముల్‌

Vinare Yaposthalula Kaaryamul

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

వినరే యపోస్తలుల కార్యముల్‌ - కైస్తవు -లను వారి కవి యెంతో ధైర్యముల్‌

Vinare Yaposthalula Kaaryamul - Kaisthavu -Lanu Vaari Kavi Yentho Dhairyamul

= మనసు లొక్కటిం జేసి - కొని యట్లు ప్రార్ధింప - ఘన ముగ విమలాత్మ -

= Manasu Lokkatin Jesi - Koni Yatlu Praardhimpa - Ghana Muga Vimalaathma -

చనుదెంచె వారిపై 1వినరే||

Chanudenche Vaaripai 1Vinare||

1. . పరమండలమునుండి వచ్చెను - పెద్ద - కరువలివలె శబ్ద మిచ్చెను = తిర

1. . Paramandalamunundi Vachchenu - Pedda - Karuvalivale Shabda Michchenu = Thira

ముగ వార లం- దరుం గూడి యున్న మం-దిర మెల్ల నిండె బం-ధురమై

Muga Vaara Lan- Darun Goodi Yunna Man-Dira Mella Ninde Ban-Dhuramai

తన్నాదము ||వినరే||

Thannaadamu ||Vinare||

2. _ అనలార్చులను దీప్తి మించుచు-బీంట-లగు జిహ్వల్వలె గనుపించుచు =

2. _ Analaarchulanu Deepthi Minchuchu-Beenta-Lagu Jihvalvale Ganupinchuchu =

ఘనముగ నొక్కొక్క - జనునిపై - నవి నిల్వం - గను బరిశుద్ధాత్మచే - తను

Ghanamuga Nokkokka - Janunipai - Navi Nilvan - Ganu Barishuddhaathmache - Thanu

నింపంబడి రంత ||వినరే||

Nimpambadi Rantha ||Vinare||

3. _ వారన్య భాషలతోడను - నాత్మ - ప్రేరణమును జేయు జాడను = ధారా

3. _ Vaaranya Bhaashalathodanu - Naathma - Preranamunu Jeyu Jaadanu = Dhaaraa

ళముగ భాషాం-తరము లాడిరి విన్న-వారి కబ్బురమై వి - చారము ల్పొడమంగ

Lamuga Bhaashaan-Tharamu Laadiri Vinna-Vaari Kabburamai Vi - Chaaramu Lpodamangga

||వినరే||

||Vinare||

4 ముందట వారిటుల గుంపుగ - మోద-మందుచు దేవనిం గొల్చి తా =

4 Mundata Vaaritula Gumpuga - Moda-Manduchu Devanin Golchi Thaa =

మందరు చూడంగ - వింత వింత పనుల - నందందు జేసిరి - దేవుని

Mandaru Choodangga - Vintha Vintha Panula - Nandandu Jesiri - Devuni

దయచేత |||వినరే||

Dayachetha |||Vinare||

5. _ మనము నా రీతిగ గుంపుగాం గూడి - మన దేవుం గొల్వంగ భూమిలో =

5. _ Manamu Naa Reethiga Gumpugaan Goodi - Mana Devun Golvangga Bhoomilo =

మనుజుల కాశ్చర్య - మగు కార్యములం జేయ - నొనగూడు మనసు

Manujula Kaashcharya - Magu Kaaryamulan Jeya - Nonagoodu Manasu

కా-నందమును గల్లు ||వినరే||

Kaa-Nandamunu Gallu ||Vinare||

Related Telugu Christian Songs