వందనం నీకే వందనం

Vandanan Neeke Vandanang

Telugu by రావూరి దావీదు • andhra-kraisthava-keerthanalu

వందనం నీకే వందనం - పరిశుద్ధ శిరమా - వందనం - నీకే - వందనం

Vandanan Neeke Vandanan - Parishuddha Shiramaa - Vandanan - Neeke - Vandanan

= వందనం బొనరింతు నీ దౌ - నందమగు ఘన నామమునకె ||వందనం||

= Vandanan Bonarinthu Nee Dau - Nandamagu Ghana Naamamunake ||Vandanan||

1... సుందరుండ నీ శిరసు హేళనం - బొందె ముండ్ల కిరీట ముంచగ -

1... Sundarunda Nee Shirasu Helanan - Bonde Mundla Kireeta Munchaga -

నెందుం జూచిన రక్త బిందులు - చిందుచుండెడి గాయములతో - (గగ్రందెనా -

Nendun Joochina Raktha Bindulu - Chinduchundedi Gaayamulatho - (Gagrandenaa -

మోము - కుందెనా = యింక నే - నెందుం బోవక నిన్నుం గొలిచెద -

Momu - Kundenaa = Yingka Ne - Nendun Bovaka Ninnun Golicheda -

నందముగ మహిమ ప్రభావా ||వందనం||

Nandamuga Mahima Prabhaavaa ||Vandanan||

2... భీకరుండ నీ యెదుట సర్వ - లోకములు వణికెడు ఘనముఖ - మే కరణి

2... Bheekarunda Nee Yeduta Sarva - Lokamulu Vanikedu Ghanamukha - Me Karani

నుమి వేయంబడియె వి - కార రూపము నొందికందెను - శ్రీకరా - శ్రీ శు -

Numi Veyambadiye Vi - Kaara Roopamu Nondikandenu - Shreekaraa - Shree Shu -

భాకరా =నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి - నో కరుణ భాస్కర క్షమించుము

Bhaakaraa =Ne Nee Mukha Prakaashamu Paadujesithi - No Karuna Bhaaskara Kshaminchumu

||వందనం||

||Vandanan||

3. మించు నీ ముఖ లక్షణము లహ - మంచి పెదవుల రంగుం జూడంగం -

3. Minchu Nee Mukha Lakshanamu Laha - Manchi Pedavula Ranggun Joodanggan -

గొంచెమైనను గనుపడక కృ - శించి దౌడలు క్రుంగిపోవుట - నెంచంగా

Gonchemainanu Ganupadaka Kru - Shinchi Daudalu Krunggipovuta - Nenchanggaa

నాలో - చించంగా = ఆ నీ - యంచితపు బల శౌర్యములు హ - రించి

Naalo - Chinchanggaa = Aa Nee - Yanchithapu Bala Shauryamulu Ha - Rinchi

పోయెను మరణ బలమున ||వందనం||

Poyenu Marana Balamuna ||Vandanan||

4. సిలువ యెదుటను నిపుడు నేనింక - నిలిచి నినుం 'బ్రార్ధింతుం బ్రభువా -

4. Siluva Yedutanu Nipudu Neningka - Nilichi Ninun 'Braardhinthun Brabhuvaa -

ఖలుండ నని ననుం ద్రోయకుము నే - నలసి సొలసిన నిన్ను విడువక -

Khalunda Nani Nanun Droyakumu Ne - Nalasi Solasina Ninnu Viduvaka -

పిలిచెద - నిన్నేం - గొలిచెద = నీ తల - బలిమి చావున వాల్చగను నా -

Pilicheda - Ninnen - Golicheda = Nee Thala - Balimi Chaavuna Vaalchaganu Naa -

యేసు నినుం జేతులతో నాపెద ||వందనం||

Yesu Ninun Jethulatho Naapeda ||Vandanan||

5. _ నిన్ను నేం గొనియాడుటకు నిపు - డున్న భాషలు చాల వింక ని - న్నెటుల

5. _ Ninnu Nen Goniyaadutaku Nipu - Dunna Bhaashalu Chaala Vingka Ni - Nnetula

నే నుతియింతునో హో - సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు - ఖిన్నునిం -

Ne Nuthiyinthuno Ho - Sanna Rakshaka Provu Na Nneda Baayaku - Khinnunin -

జేయకు = నా కొర - కిన్ని బాధల నొందితివి నా - యన్న నా జీవంబు నీదే

Jeyaku = Naa Kora - Kinni Baadhala Nondithivi Naa - Yanna Naa Jeevambu Neede

||వందనం||

||Vandanan||

6. _ మరణ దినమున భయము పడి నీ - కొర కెదురు జూడంగం గృపతో -

6. _ Marana Dinamuna Bhayamu Padi Nee - Kora Keduru Joodanggan Grupatho -

వరబలుండా నా విరోధుని - కరకు శరములం ద్రుంచ రావె - శూరుండా -

Varabalundaa Naa Virodhuni - Karaku Sharamulan Druncha Raave - Shoorundaa -

దేవకు - మారుండా = అటు నీ - మరణ రూపము సిలువపైనా -

Devaku - Maarundaa = Atu Nee - Marana Roopamu Siluvapainaa -

తరుణమునం జూపుము యెహోవా ||వందనం||

Tharunamunan Joopumu Yehovaa ||Vandanan||

Related Telugu Christian Songs