వందనమయ్యా యేసు నీకు
Vandanamayyaa Yesu Neeku
వందనమయ్యా - యేసు నీకు - వందనమయ్యా - మా కోరిక - లందియ్యవయ్యా
Vandanamayyaa - Yesu Neeku - Vandanamayyaa - Maa Korika - Landiyyavayyaa
వందనమయ్య నీ సుందర పాదారవిందములకు భక్తి - వినతులు గావింతు
Vandanamayya Nee Sundara Paadaaravindamulaku Bhakthi - Vinathulu Gaavinthu
సందియంబులులేని పరమానందమున నీయందు డెందము - పొందుపడం జేయవె
Sandiyambululeni Paramaanandamuna Neeyandu Dendamu - Pondupadam Jeyave
యెహోవా - నందనా పాపేంధనాగ్ని ||వందనమయ్యా||
Yehovaa - Nandanaa Paapendhanaagni ||Vandanamayyaa||
1. నర దైవత్వములు - రెండుగూడి - పరిపూర్ణమైన - దేహాత్మలు - ధరియించి యందు
1. Nara Daivathvamulu - Rendugoodi - Paripoornamaina - Dehaathmalu - Dhariyinchi Yandu
లేశంబయిన - దురితంబులేని - యవతారము - నెరవుగా దాల్చి
Leshambayina - Durithambuleni - Yavathaaramu - Neravugaa Daalchi
ధరణికి నేతెంచి నిరయార్హులగు సర్వ - నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము
Dharaniki Nethenchi Nirayaarhulagu Sarva - Narula Rakshimpa Nee Karunaa Pravaahamu
విరివిగా పరుగెత్తం జేయుచు - విమలమగు నీ ప్రాణరక్తము - లరుదుగా సమర్పణము చేసియు
Virivigaa Parugeththam Jeyuchu - Vimalamagu Nee Praanarakthamu - Larudugaa Samarpanamu Chesiyu
తిరిగి లేచితివో మహా ప్రభూ ||వందనమయ్యా||
Thirigi Lechithivo Mahaa Prabhoo ||Vandanamayyaa||
2. నీ పుణ్యమందు - నమ్ముకొనెడి - యే పాపియైన - తక్షణమున
2. Nee Punyamandu - Nammukonedi - Ye Paapiyaina - Thakshanamuna
శాపంబుం బాసి - త్రాణగలిగి - నీ సజ్ఞనుండు - కృపవానిని - కాపాడుచుండు
Shaapambum Baasi - Thraanagaligi - Nee Sajnyanundu - Krupavaanini - Kaapaaduchundu
దీపించు భవదీయ దివ్య వాగ్దత్తంబు - లాపత్సరంపరల కడ్డుపడుచు నుండి
Deepinchu Bhavadeeya Divya Vaagdaththambu - Laapathsaramparala Kaddupaduchu Nundi
నీ యోగద భారమెల్లను - మోసి యోపికనుండ నేర్చిన
Nee Yogada Bhaaramellanu - Mosi Yopikanunda Nerchina
పాపి పుణ్యుండగుచు నాత్మను - భవ్య సుఖమఖిలంబుం బడయును ||వందనమయ్యా||
Paapi Punyundaguchu Naathmanu - Bhavya Sukhamakhilambum Badayunu ||Vandanamayyaa||
3. శమదమ ప్రేమ - కృపా వినయ - సద్గుణములనెడి - భూషణముల
3. Shamadama Prema - Krupaా Vinaya - Sadgunamulanedi - Bhooshanamula
నిమిడియున్నట్టి - తనువు దాల్చి - క్రమముగానందు - దైవత్వము కనుపరచినావు
Nimidiyunnatti - Thanuvu Daalchi - Kramamugaanandu - Daivathvamu Kanuparachinaavu
విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య - సముదయమునకు నుత్తముగా బోధించి
Vimalopadeshamul Vividhambugaa Shishya - Samudayamunaku Nuththamugaa Bodhinchi
యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను
Yamitha Paapaharambunaku Bhuvinavatharinchina Menu Siluvanu
శ్రమను మృతికల్పించి మృత్యువు - జంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా||
Shramanu Mruthikalpinchi Mruthyuvu - Jampi Jeevinchina Mahaathmaa ||Vandanamayyaa||