ఉన్నతమైన స్థలములలో

Unnathamaina Sthalamulalo

Telugu • vidhyaarthi-geethaavali

ఉన్నతమైన స్థలములలో – ఉన్నతుడా మా దేవా

Unnathamaina Sthalamulalo – Unnathudaa Maa Devaa

ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా

Unnathamaina Nee Maargamulu Maaku Thelupumu Devaa

1. చెదరి పోయినది మా దర్శనము – మందగించినది ఆత్మలభారం

1. Chedari Poyinadi Maa Darshanamu – Mandaginchinadi Aathmalabhaaram

మరచిపోతిమి నీ తొలిపిలుపు – నీ స్వరముతో మము మేలుకొలుపు

Marachipothimi Nee Tholipilupu – Nee Svaramutho Mamu Melukolupu

నీ ముఖకాంతిని ప్రసరింపచేసి – నూతన దర్శన మీయుము దేవా

Nee Mukhakaanthini Prasarimpachesi – Noothana Darshana Meeyumu Devaa

నీ సన్నిధిలో సాగిలపడగా – ఆత్మతో మము నిలుపుము దేవా

Nee Sannidhilo Saagilapadagaa – Aathmatho Mamu Nilupumu Devaa

2. పరిశోధించుము మా హృదయములను – తెలిసికొనుము మా తలంపులను

2. Parishodhinchumu Maa Hrudayamulanu – Thelisikonumu Maa Thalampulanu

ఆయాసకరమైన మార్గము మాలో – వున్నదేమో పరికించు చూడు

Aayaasakaramaina Maargamu Maalo – Vunnademo Parikinchu Choodu

జీవపు ఊటలు మాలోన నింపి – సేదదీర్చి బ్రతికించు మమ్ము

Jeevapu Ootalu Maalona Nimpi – Sedadeerchi Brathikinchu Mammu

మా అడుగులను నీ బండపైన – స్థిరపరచి బలపరచుము దేవా

Maa Adugulanu Nee Bandapaina – Sthiraparachi Balaparachumu Devaa

3. మా జీవితములు నీ సన్నిధిలో – పానార్పణముగా ప్రోక్షించెదము

3. Maa Jeevithamulu Nee Sannidhilo – Paanaarpanamugaa Prokshinchedamu

సజీవయాగ శరీరములతో – రూపాంతర నూతన మనసులతో

Sajeevayaaga Shareeramulatho – Roopaanthara Noothana Manasulatho

నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము – నీ కృపచేత బలపడియెదము

Nee Aathmaku Lobadi Velledamu – Nee Krupachetha Balapadiyedamu

లోకమున నీ వార్తను మేము – భారము తోడ ప్రకటించెదము

Lokamuna Nee Vaarthanu Memu – Bhaaramu Thoda Prakatinchedamu

Related Telugu Christian Songs