తెరువబడియున్నది కృప ద్వారము

Theruvabadiyunnadi Krupa Dwaaramu

Telugu by సీయోను గీతాలు

తెరువబడియున్నది కృప ద్వారము

Theruvabadiyunnadi Krupa Dwaaramu

త్వరపడి రమ్మని పిలిచె నేసు (2)

Thvarapadi Rammani Piliche Yesu (2)

1. ఎవరును నశియింప వలదని

1. Evarunu Nashiyimpa Valadani

ఓరిమి ప్రభువు వహియించును (2)

Orimi Prabhuvu Vahiyinchunu (2)

మారు మనస్సును పొందు సమయమిదే

Maaru Manassunu Pondu Samayamidhe

మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు (2) ||తెరువబడియున్నది||

Makkuvatho Prabhuvu Piluchuchunnaadu (2) ||Theruvabadiyunnadi||

2. ద్వారము తెరువబడియుండగ

2. Dvaaramu Theruvabadiyundaga

దయచూపి నిన్ను రమ్మనె ప్రభువు (2)

Dayachoopi Ninnu Rammane Prabhuvu (2)

దీనిని నీవు అంగీకరించిన

Deenini Neevu Angeekarinchina

దేవుని దీవెనలు పొందెదవు (2) ||తెరువబడియున్నది||

Devuni Deevenalu Pondedavu (2) ||Theruvabadiyunnadi||

3. రాత్రి గడచిపోయి పగలాయెను

3. Raathri Gadachipoyi Pagalaayenu

అతిక్రమములను వీడుమనె ప్రభు (2)

Athikramamulanu Veedumane Prabhu (2)

నీతి సూర్యుండు ఉదయించును

Neethi Sooryundu Udayinchunu

భీతిని విడచి సిద్ధపడుము (2) ||తెరువబడియున్నది||

Bheethini Vidachi Siddhapadumu (2) ||Theruvabadiyunnadi||

4. అర్థ రాత్రి వేళ గొప్ప సందడాయెను

4. Ardha Raathri Vela Goppa Sandadaayenu

అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియు (2)

Adigo Pendli Kumaarundu Vachchenaniyu (2)

సిద్ధముగానున్న వారే వెళ్ళెదరుగా

Siddhamugaanunna Vaare Velledarugaa

ఆ ద్వారము మూయబడు త్వరపడుమా (2) ||తెరువబడియున్నది||

Aa Dvaaramu Mooyabadu Thvarapadumaa (2) ||Theruvabadiyunnadi||

5. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను

5. Vellagoriyunna Siddhapadavalenu

యేసు రక్తమందు శుద్ధకావలెను (2)

Yesu Rakthamandu Shuddhakaavalenu (2)

ఘనముగ మీరు ప్రవేశింపవలెను

Ghanamuga Meeru Praveshimpavalenu

మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే (2) ||తెరువబడియున్నది||

Mana Thandri Yokka Poorna Sankalpamide (2) ||Theruvabadiyunnadi||

Related Telugu Christian Songs