తనువును నమ్మి

Thanuvunu Nammi

Telugu • joyful-journey

తనువును నమ్మి తండ్రిని మరచి – దినదినమును జీవించెదవా

Thanuvunu Nammi Thandrini Marachi – Dinadinamunu Jeevinchedavaa

కనికర హృదయుడు యేసుని నమ్మక – కాలము వ్యర్థపరచెదవా

Kanikara Hrudayudu Yesuni Nammaka – Kaalamu Vyarthaparachedavaa

అలనాడా ధనికుడు సుఖభోగముల ప్రేమించి మురియుచుండా

Alanaadaa Dhanikudu Sukhabhogamula Premanchi Muriyuchundaa

బలమగు దేవుడు ధనికుని అపుడే – యిలలోనుండి పిలిచెనుగా

Balamagu Devudu Dhanikuni Apude – Yilalonundi Pilichenugaa

రాజ్యము కొరకై రంకెలువేసి – రాజులు పదవులు గోల్పోయి

Raajyamu Korakai Rangkeluvesi – Raajulu Padavulu Golpoyi

రాజ్యపు కాంక్షలచేతను మృతులై – రాజగు యేసుని విడచిరిగా

Raajyapu Kaangkshalachethanu Mruthulai – Raajagu Yesuni Vidachirigaa

అందముకొరకై ఆభరణములు – అలంకరించుకొనుటేల

Andamukorakai Aabharanamulu – Alangkarinchukonutela

పొందుగా సత్క్రియలు వినయంబే – పూబోడుల కందంబెగదా

Pondugaa Sathkriyalu Vinayambe – Poobodula Kandambegadaa

అప్పగించితివి నీ అవయవములు – తప్పుడు క్రియలకు పూర్వంబు

Appaginchithivi Nee Avayavamulu – Thappudu Kriyalaku Poorvambu

అప్పగించుము నీతికొరకు నీవిప్పుడు ప్రభుని సన్నిధిలో

Appaginchumu Neethikoraku Neevippudu Prabhuni Sannidhilo

దేహము దేవుడిచ్చెను నీకు – దేవుని మహిమ కొరకేగా

Dehamu Devudichchenu Neeku – Devuni Mahima Korakegaa

దేహమునందు దేవుని ఆత్మ – దివ్యముగా నివసించెనుగా

Dehamunandu Devuni Aathma – Divyamugaa Nivasinchenugaa

ఆత్మయు తనువు ప్రాణము ప్రభుకై – ప్రీతితో సమర్పించుకొని

Aathmayu Thanuvu Praanamu Prabhukai – Preethitho Samarpinchukoni

అతి పరిశుద్ధత పొందుము నీవీక్షితిలో ధన్యుడవయ్యెదవు

Athi Parishuddhatha Pondumu Neeveekshithilo Dhanyudavayyedavu

Related Telugu Christian Songs