తండ్రి తనయ

Thandri Thanaya

Telugu by రూత్ నంద వర్ధన్

తండ్రి తనయ పరిశుద్ధాత్ముడవైన దేవా

Thandri Thanaya Parishuddhaathmudavaina Devaa

త్రిత్వ మహిమ హృదిలో నీవు వెలసినావా (2)

Thrithva Mahima Hrudilo Neevu Velasinaavaa (2)

1. ఉన్నతమైన స్థలములలో నివసించు దేవా

1. Unnathamaina Sthalamulalo Nivasinchu Devaa

విలువకందని రక్షణను నాకిచ్చినావా (2)

Viluvakandani Rakshananu Naakichchinaavaa (2)

ఊరి వెలుపల ఉన్న నన్ను ఒడిలో చేర్చి

Oori Velupala Unna Nannu Odilo Cherchi

ఊరడించి ఆదరించినావు కావా (2) ||తండ్రి||

Ooradinchi Aadarinchinaavu Kaavaa (2) ||Thandri||

2. అద్భుతమైన ప్రేమమయుడగు ప్రభువే నీవు

2. Adbhuthamaina Premamayudagu Prabhuve Neevu

అంతులేని నీ ప్రేమ మాకు పంచినావా (2)

Anthuleni Nee Prema Maaku Panchinaavaa (2)

ఆది అంతము లేని దేవా మహిమోన్నతుడా

Aadi Anthamu Leni Devaa Mahimonnathudaa

అమరమైన ప్రేమకు మే ధన్యులమయ్యా (2) ||తండ్రి||

Amaramaina Premaku Me Dhanyulamayyaa (2) ||Thandri||

3. సృష్టికర్త సర్వేశ్వరుడవు నీవే దేవా

3. Srushtikartha Sarveshvarudavu Neeve Devaa

స్థిరములేని నాకు నీవు స్థలమిచ్చినావా (2)

Sthiramuleni Naaku Neevu Sthalamichchinaavaa (2)

సాటిలేని ఉన్నతమైన పిలుపుకు నేను

Saatileni Unnathamaina Pilupuku Nenu

సన్నుతించి జీవితమంతా మ్రొక్కెదనయ్యా (2) ||తండ్రి||

Sannuthinchi Jeevithamanthaa Mrokkedanayyaa (2) ||Thandri||

Related Telugu Christian Songs