తంబుర సితారతో మా ప్రభుని

Thambura Sithaaratho Maa Prabhuni

Telugu by సీయోను గీతాలు

Thambura Sithaaratho

తంబుర సితారతో

Maa Prabhuni Aaraadhinchedamu (2)

మా ప్రభుని ఆరాధించెదము (2)

Thana Nivaasamuga

తన నివాసముగ

Mammu Srushtinchina (2)

మమ్ము సృష్టించిన (2)

Naathuni Pogadedamu

నాథుని పొగడెదము

Sthuthigaanamu Chesedamu (2) ||Thambura||

స్తుతిగానము చేసెదము (2) ||తంబుర||

1. Aadi Aadaamu Marana Shaasanamu

1. ఆది ఆదాము మరణ శాసనము

Maa Shareeramun Eluchundagaa (2)

మా శరీరమున్ ఏలుచుండగా (2)

Amarudavai Prabhoo

అమరుడవై ప్రభూ

Bhuvikethenchi (2)

భువికేతెంచి (2)

Maranapu Mullu Virachi

మరణపు ముల్లు విరచి

Maranamun Gelichina Maa Prabhuvaa (2) ||Thambura||

మరణమున్ గెలిచిన మా ప్రభువా (2) ||తంబుర||

2. Paapamu Nundi Cheekati Nundi

2. పాపము నుండి చీకటి నుండి

Aashcharyakaramagu Velugulo Nadipi (2)

ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి (2)

Thana Aalayamuga

తన ఆలయముగ

Chesina Prabhuku (2)

చేసిన ప్రభుకు (2)

Sthuthi Mahima Ghanatha

స్తుతి మహిమ ఘనత

Seeyonulo Arpinchedameppudu (2) ||Thambura||

సీయోనులో అర్పించెదమెప్పుడు (2) ||తంబుర||

3. Paraloka Piluputho Prabhu Mammu Pilachi

3. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి

Narakapu Shiksha Tholaginche Maanundi (2)

నరకపు శిక్ష తొలగించె మానుండి (2)

Parishuddhulatho

పరిశుద్ధులతో

Mammu Cherchina Prabhoo (2)

మమ్ము చేర్చిన ప్రభూ (2)

Nirminchenu Yilalo

నిర్మించెను యిలలో

Gruhamugaa Thana Aathma Dvaaraa (2) ||Thambura||

గృహముగా తన ఆత్మ ద్వారా (2) ||తంబుర||

4. Aathmeeya Intiki Kreesthe Punaadi

4. ఆత్మీయ యింటికి క్రీస్తే పునాది

Sajeevamaina Ralle Prajalu (2)

సజీవమైన రాళ్ళే ప్రజలు (2)

Aathmeeya Gruhamuku

ఆత్మీయ గృహముకు

Prabhuve Shilpi (2)

ప్రభువే శిల్పి (2)

Aadyantharahithudai

ఆద్యంతరహితుడై

Nadupunu Mokshapuriki Mammu (2) ||Thambura||

నడుపును మోక్షపురికి మమ్ము (2) ||తంబుర||

5. Mannayinadi Venukativalene

5. మన్నయినది వెనుకటివలెనే

Marala Bhoomiki Thappaka Cherun (2)

మరల భూమికి తప్పక చేరున్ (2)

Maanava Sampada

మానవ సంపద

Keerthi Mahimalu (2)

కీర్తి మహిమలు (2)

Gathinchi Povunila

గతించి పోవునిల

Seeyonu Maruvaku Nee Prabhuni (2) ||Thambura||

సీయోను మరువకు నీ ప్రభుని (2) ||తంబుర||

6. Lebaanonu Veedi Naatho Rammu

6. లెబానోను వీడి నాతో రమ్ము

Lokapu Aashalu Gathinchipovunu (2)

లోకపు ఆశలు గతించిపోవును (2)

Hermonu Gethsemane

హెర్మోను గెత్సేమనే

Golgothaa Daatuchu (2)

గొల్గొతా దాటుచు (2)

Hebronu Cherudamu

హెబ్రోను చేరుదము

Prabhuvunu Aaraadhinchedamu (2) ||Thambura||

ప్రభువును ఆరాధించెదము (2) ||తంబుర||

Related Telugu Christian Songs