స్త్రీల మైత్రిలో చేర రారమ్మా

Sthreela Maithrilo Chera Raarammaa

Telugu by కొంగర సామ్యేల్ సంజీవి • andhra-kraisthava-keerthanalu

స్త్రీల మైత్రిలో చేర రారమ్మా

Sthreela Maithrilo Chera Raarammaa

శ్రీ యేసు ప్రభుని - శ్రేయ మొప్పుగ కొలువ రారమ్మా (2)

Shree Yesu Prabhuni - Shreya Moppuga Koluva Raarammaa (2)

స్త్రీల సేవను ప్రేమతో గొని

Streela Sevanu Prematho Goni

చాలా దయతో చేర దీసి

Chaalaa Dayatho Chera Deesi

మేలు చేసి యాదరించిన

Melu Chesi Yaadarinchina

యేసు పేరట సేవచేయును ||స్త్రీల||

Yesu Perata Sevacheyunu ||Sthreela||

1. భక్తురాండ్రగు స్త్రీల పరిచర్యన్

1. Bhakthuraandragu Sthreela Paricharyan

ప్రభు యేసు ధరలో - మక్కువతో యంగీకరించెనుగా (2)

Prabhu Yesu Dharalo - Makkuvatho Yangeekarinchenugaa (2)

శక్తి గల యా రక్షకుండు

Shakthi Gala Yaa Rakshakundu

యెక్కువగు యాదరణ జూపి

Yekkuvagu Yaadarana Joopi

తక్కువగు మన స్త్రీల స్థితినిల

Thakkuvagu Mana Streela Sthithinila

యుక్తముగ బహు యుద్ధరించెను ||స్త్రీల||

Yukthamuga Bahu Yuddharinchenu ||Sthreela||

2. అందరు స్త్రీ సేనగా చేరి

2. Andaru Sthree Senagaa Cheri

స్థిరమైన మైత్రిలో - మేలుగా రక్షకుని గొనియాడి (2)

Sthiramaina Maithrilo - Melugaa Rakshakuni Goniyaadi (2)

వీలుగా మన దేశమునకు

Veelugaa Mana Deshamunaku

పాలు మానక సేవ చేసి

Paalu Maanaka Seva Chesi

చాలగా మన యేసు ప్రేమను

Chaalagaa Mana Yesu Premanu

చక్కగా ప్రత్యక్షపర్చను ||స్త్రీల||

Chakkagaa Prathyakshaparchanu ||Sthreela||

3. దక్షిణిండియా సభలో నున్నటి

3. Dakshina India Sabhalo Nunnati

స్త్రీలంత గూడి - ఏకమగు సహవాసమందుండి (2)

Sthreelantha Goodi - Ekamagu Sahavaasamandundi (2)

దీక్షతో ప్రార్థనల యందు

Deekshatho Praardhanala Yandu

సేవ యందు సాక్ష్యమందు

Seva Yandu Saakshyamandu

రక్షకుండగు యేసు శక్తిని

Rakshakundagu Yesu Shakthini

స్పష్టముగనిల చాటి చూపను ||స్త్రీల||

Spashtamuganila Chaati Choopanu ||Sthreela||

Related Telugu Christian Songs