స్తోత్రించెదము స్తోత్రించెదము

Sthothrinchedamu Sthothrinchedamu

Telugu • joyful-journey

స్తోత్రించెదము – స్తోత్రించెదము – యేసు దేవుడా

Sthothrinchedamu – Sthothrinchedamu – Yesu Devudaa

మా జీవనాధా – ప్రేమనాధ – స్తోత్రించెదము

Maa Jeevanaadhaa – Premanaadha – Sthothrinchedamu

ఏడు నక్షత్రములను – కుడిచేత పట్టుకొని

Edu Nakshathramulanu – Kudichetha Pattukoni

ఏడు దీపంబుల మధ్య – సంచరించువాడా ||స్తో||

Edu Deepambula Madhya – Sancharinchuvaadaa ||Stho||

మొదటివాడా – కడపటివాడా – మృతుడూనవాడా

Modativaadaa – Kadapativaadaa – Mruthudoonavaadaa

మృతిరి గెల్చి లేచినవాడా – మది నిను దలచెదమూ ||స్తో||

Mruthiri Gelchi Lechinavaadaa – Madi Ninu Dalachedamoo ||Stho||

వాడియైన రెండంచుల ఖడ్గము గలవాడా

Vaadiyaina Rendanchula Khadgamu Galavaadaa

పాడి నిన్ను భజియించెదము – పరమ పురివాస ||స్తో||

Paadi Ninnu Bhajiyinchedamu – Parama Purivaasa ||Stho||

అగ్నిజ్వాలవంటి – కన్నులు కలిగినవాడా

Agnijvaalavanti – Kannulu Kaliginavaadaa

అపరంజిని పోలిన – పాదముల దేవుని కుమార ||స్తో||

Aparanjini Polina – Paadamula Devuni Kumaara ||Stho||

ఏడు నక్షత్రములు – దేవుని యేడాత్మలునూ

Edu Nakshathramulu – Devuni Yedaathmalunoo

కలిగినవాడా కరుణించి – మము కాపాడుమయ్యా ||స్తో||

Kaliginavaadaa Karuninchi – Mamu Kaapaadumayyaa ||Stho||

దావీదు తాళపుచెవి – బడసినవాడా

Daaveedu Thaalapuchevi – Badasinavaadaa

సత్య స్వరూపి పరిశుద్ధుండా – సంఘములకు కర్త ||స్తో||

Sathya Svaroopi Parishuddhandaa – Sangghamulaku Kartha ||Stho||

ఆమెన్ అనువాడా – నమ్మకమైన నాధుడా

Aamen Anuvaadaa – Nammakamaina Naadhudaa

సత్యసాక్షి దేవుని సృష్టికి – ఆదియి నీవేగా ||స్తో||

Sathyasaakshi Devuni Srushtiki – Aadiyi Neevegaa ||Stho||

Related Telugu Christian Songs