సిలువేకదా చింతసదా

Siluvekadaa Chinthasadaa

Telugu by రావూరి రంగయ్య • andhra-kraisthava-keerthanalu

సిలువేకదా చింతసదామహా - సిలువేకదా - మనకమోఘము - వెలలేని

Siluvekadaa Chinthasadaamahaa - Siluvekadaa - Manakamoghamu - Velaleni

యాత్మ సంభోగము - విలసత్చరమ ద్రవ్యభాగ్యము - గుణత్యాగము ననురాగము

Yaathma Sambhogamu - Vilasathcharama Dravyabhaagyamu - Gunathyaagamu Nanuraagamu

మహా ||సిలువే||

Mahaa ||Siluve||

1. సిలువ బోధకు చెవినొగ్గుమా - చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు

1. Siluva Bodhaku Chevinoggumaa - Cheluvamugona Naathma Noggumu Valla Noppu

నీకు సౌభాగ్యము - ఆత్మారోగ్యము నెంతో శ్లాఘ్యము ||సిలువే||

Neeku Saubhaagyamu - Aathmaarogyamu Nentho Shlaaghyamu ||Siluve||

2. చంపెనిందు ప్రభుని కర్తను - సంపాదించె నర విముక్తుని బెంపారు

2. Champenindu Prabhuni Karthanu - Sampaadinche Nara Vimukthuni Bempaaru

నానందమసూక్తిని - ననురక్తిని నిత్యముక్తిని మహా ||సిలువే||

Naanandamasookthini - Nanurakthini Nithyamukthini Mahaa ||Siluve||

3. _పాపదావాగ్ని సంతుప్తులు - స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన

3. _Paapadaavaagni Santhupthulu - Svapunyadurmada Vyaapthulu Nee Peru Nammina

దీప్తలు - సుఖ ప్రాప్తులు సర్వ మహా ||సిలువే||

Deepthalu - Sukha Praapthulu Sarva Mahaa ||Siluve||

4. రంగొప్ప దీని ప్రసంగము - మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ

4. Ranggoppa Deeni Prasanggamu - Manggalageethasaaranggamu Anggeekaara Hruthpadma

భృంగము - రక్షశ్చంగము పాపభంగము మహా ||సిలువే||

Bhrunggamu - Rakshashchanggamu Paapabhanggamu Mahaa ||Siluve||

5. భయములేదని చాటుచున్నది - ప్రియయేసు వేడుకొమ్మన్నది - దయ జూపు

5. Bhayamuledani Chaatuchunnadi - Priyayesu Vedukommannadi - Daya Joopu

నీ కనుచున్నది - నిక్కమైనది చక్మనైనది మహా ||సిలువే||

Nee Kanuchunnadi - Nikkamainadi Chakmanainadi Mahaa ||Siluve||

6. చేరవచ్చిన వారి భారము - ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ

6. Cheravachchina Vaari Bhaaramu - Ghoramainanu Thadvichaaramu Aaroodhiparamaartha

సారము - సువిచారము సదాచారము మహా ||సిలువే||

Saaramu - Suvichaaramu Sadaachaaramu Mahaa ||Siluve||

7... ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి జేర్చువైనము - జనకృపాసుధా

7... Ghanamaina Rakshaka Dhyaanamu Manala Mukthiki Jerchuvainamu - Janakrupaasudhaa

పానము దూతగానము తేజోమానము మహా

Paanamu Doothagaanamu Thejomaanamu Mahaa

8. దినము లూరకుంటిమి - యిపుడే రక్షణ కనుగొంటిమి - కన్న తండ్రిని

8. Dinamu Loorakuntimi - Yipude Rakshana Kanugontimi - Kanna Thandrini

గొల్వకుంటిమి - కానకుంటిమి యెరగకుంటిమి మహా ||సిలువే||

Golvakuntimi - Kaanakuntimi Yeragakuntimi Mahaa ||Siluve||

Related Telugu Christian Songs