శృంగార దేశము చేరంగానే

Shrunggaara Deshamu Cheranggaane

Telugu by చార్లెస్ హోమర్ గాబ్రియేల్ • andhra-kraisthava-keerthanalu

1. శృంగార దేశము చేరంగానే

1. Shrunggaara Deshamu Cheranggaane

నా దుఃఖ బాధలన్నియుం బోవున్

Naa Duhkha Baadhalanniyun Bovun

యేసుని యొద్దను నిత్యమునే

Yesuni Yoddanu Nithyamune

నుండుట మిక్కిలి యాశ్చర్యము

Nunduta Mikkili Yaashcharyamu

|| ఇదే నాకు ఆనందము

|| Ide Naaku Aanandamu

ఆనందము, ఆనందము

Aanandamu, Aanandamu

నేను ఆయనను జూచుటయే

Nenu Aayananu Joochutaye

ఇదే నాకుం బరమానందము||

Ide Naakun Baramaanandamu||

2. అమితమైన కృపవలన

2. Amithamaina Krupavalana

నన్ను స్వర్గంబునం జేర్చుదురు

Nannu Svargambunan Jerchuduru

అచ్చోటనుండి యేసుని గాంచి

Achchotanundi Yesuni Gaanchi

స్తుతి కీర్తనలు పాడుదును.

Sthuthi Keerthanalu Paadudunu.

3. నేను ప్రేమించు స్నేహితులును

3. Nenu Preminchu Snehithulunu

అక్కడం జూచి సంతోషింతును

Akkadan Joochi Santhoshinthunu

నాయేసు ముఖము చూచుటయే

Naayesu Mukhamu Choochutaye

నిత్యము నాకది యానందము.

Nithyamu Naakadi Yaanandamu.

4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు

4. Aa Svarga Saukhya Monduvaraku

కండ్లతోం జూడక పోయినను

Kandlathom Joodaka Poyinanu

యేసుని మాటలు గైకొనుచు

Yesuni Maatalu Gaikonuchu

నాత్మతోం జూచి సంతోషింతును

Naathmathom Joochi Santhoshinthunu

Related Telugu Christian Songs