శ్రీ యేసు కర్తను

Shree Yesu Karthanu

Telugu by బేతాళ జాన్ • andhra-kraisthava-keerthanalu

శ్రీ యేసు కర్తను - సేవక జేయుటకు మేల్గొను - శ్రీయేసు కర్తను

Shree Yesu Karthanu - Sevaka Jeyutaku Melgonu - Shreeyesu Karthanu

శ్రేయముల నెరిగి - నీకు రేయిపవ లొసంగి

Shreyamula Nerigi - Neeku Reyipava Losamgi

యెడబాయని యంతరంగి - యాపాయంబు బ్రోవు సహాయంబుంజేయ ||శ్రీ యేసు||

Yedabaayani Yamtharamgi - Yaapaayambu Brovu Sahaayambumjeya ||Shree Yesu||

1. నిదురయందు నేడు - క్షేమ మొదవం గాచినాండు

1. Nidurayamdu Nedu - Kshema Modavam Gaachinaamdu

సూర్యుం డుదయ మాయెంజూడు - నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||

Sooryum Dudaya Maayemjoodu - Nee Hrudayamuna Sadamala Padavuludayimpa ||Shree Yesu||

2. అంధకార మణగెన్ - హృదయాంధకార మణగన్ - ప్రభు నందుం దెలివి గలుగన్

2. Amdhakaara Managen - Hrudayaamdhakaara Managan - Prabhu Namdum Delivi Galugan

నిబంధనలు డెందమున కందముగం గూర్చి ||శ్రీ యేసు||

Nibamdhanalu Demdamuna Kamdamugam Goorchi ||Shree Yesu||

3. కంటిపాప వలెను - నిను గాయువాని దయను గను గొంటివి

3. Kamtipaapa Valenu - Ninu Gaayuvaani Dayanu Ganu Gomtivi

స్తోత్రమును జేయు - మింటి కినిమంటికన్నింటికిని కర్త యని ||శ్రీ యేసు||

Sthothramunu Jeyu - Mimti Kinimamtikannimtikini Kartha Yani ||Shree Yesu||

4. కలకల ధ్వనింజేయు - పక్షిగములు లయను గూయు స్వరములు

4. Kalakala Dhvanimjeyu - Pakshigamulu Layanu Gooyu Svaramulu

ప్రభు స్తుతిజేయు - నీవలయక సొలయక వెలయంగం బాడు ||శ్రీ యేసు||

Prabhu Sthuthijeyu - Neevalayaka Solayaka Velayamgam Baadu ||Shree Yesu||

5. సేవయందు నీకు - మంచి యీవు లిడుపరాకు గల భావముంబడం

5. Sevayamdu Neeku - Mamchi Yeevu Liduparaaku Gala Bhaavamumbadam

నిను బోకు - నేడుం కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||

Ninu Boku - Nedum Kaanave Kaavave Kaavave Yamchu ||Shree Yesu||

6. పగటివార మంచు - పాప గ్రియలు ద్రుంచు - యుగయుగములు జీవించు

6. Pagativaara Mamchu - Paapa Griyalu Drumchu - Yugayugamulu Jeevimchu

పురికెగయ నీ దిగులు విడు - తగు నమ్మకమున ||శ్రీ యేసు||

Purikegaya Nee Digulu Vidu - Thagu Nammakamuna ||Shree Yesu||

7. మింటి నంటం బాడు - నీ యొంటి బలిమి నేడు - ప్రభు నంటియుండ వాండు

7. Mimti Namtam Baadu - Nee Yomti Balimi Nedu - Prabhu Namtiyumda Vaamdu

నిన్నొంటి నెన్నంటికె న్నింటికి న్వీడండు ||శ్రీ యేసు||

Ninnomti Nennamtike Nnimtiki Nveedamdu ||Shree Yesu||

Related Telugu Christian Songs