శ్రీ రక్షకుండు పుట్టంగా
Shree Rakshakundu Puttanggaa
1. శ్రీ రక్షకుండు పుట్టంగా
1. Shree Rakshakundu Puttanggaa
నాకాశ సైన్యము
Naakaasha Sainyamu
ఇహంబున కేతెంచుచు
Ihambuna Kethenchuchu
ఈ పాట పాడెను.
Ee Paata Paadenu.
'పరంబునందు స్వామికి
'Parambunandu Svaamiki
మహా ప్రభావము
Mahaa Prabhaavamu
ఇహంబునందు శాంతిని
Ihambunandu Shaanthini
వ్యాపింపనీయుండు'.
Vyaapimpaneeyundu'.
2. ఆ రమ్యమైన గానము
2. Aa Ramyamaina Gaanamu
ఈ వేళ మ్రోగును
Ee Vela Mrogunu
సంతుష్టులైన భక్తులు
Santhushtulaina Bhakthulu
ఆ ధ్వని విందురు
Aa Dhvani Vinduru
ప్రయాసపడు ప్రజల
Prayaasapadu Prajala
దుఃఖంబు తీరంగా
Duhkhambu Theeranggaa
ఆ శ్రావ్యమైన గానము
Aa Shraavyamaina Gaanamu
ఈ వేళ విందురు.
Ee Vela Vinduru.
3. పూర్వంబు దూతగానము
3. Poorvambu Doothagaanamu
భువిన్ వినంబడి
Bhuvin Vinambadi
రెండువేల వర్షములు
Renduvela Varshamulu
గతించిపోయెను
Gathinchipoyenu
భూప్రజలు విరోధులై
Bhooprajalu Virodhulai
యుద్ధంబు లాడి యా
Yuddhambu Laadi Yaa
మనోజ్ఞమైన గానము
Manognamaina Gaanamu
నలక్ష్యపెట్టిరి.
Nalakshyapettiri.
4. పాపాత్ములారా, వినుడి
4. Paapaathmulaaraa, Vinudi
శ్రీ యేసు ప్రభువ
Shree Yesu Prabhuva
మీ పాపభార మంతయు
Mee Paapabhaara Manthayu
వహింప వచ్చెను
Vahimpa Vachchenu
తాపత్రయంబు నంతయుం
Thaapathrayambu Nanthayun
దానే వహించును
Daane Vahinchunu
సంపూర్ణ శాంతి సంపద
Sampoorna Shaanthi Sampada
లను గ్రహించును.
Lanu Grahinchunu.
5. సద్భక్తులు స్తుతించిన
5. Sadbhakthulu Sthuthinchina
ఈ సత్యయుగము
Ee Sathyayugamu
ఈ వేళ నే నిజంబుగా
Ee Vela Ne Nijambugaa
సమీప మాయెను
Sameepa Maayenu
ఆ కాలమందు క్షేమము
Aa Kaalamandu Kshemamu
వ్యాపించుచుండును
Vyaapinchuchundunu
ఆ దివ్య గాన మందఱు
Aa Divya Gaana Mandaru
పాడుచు నెప్పుడు.
Paaduchu Neppudu.