శ్రీ రాజిల్లుచు యేసు
Shree Raajilluchu Yesu
1. శ్రీ రాజిల్లుచు యేసు
1. Shree Raajilluchu Yesu
క్రీస్తు వేంచేసెను
Kreesthu Venchesenu
భారతిని జయించి
Bhaarathini Jayinchi
ప్రజాలిన్ బ్రోచును!
Prajaalin Brochunu!
ఆరాజు శాశ్వితుండు
Aaraaju Shaashvithundu
భూరిదయాళుండు
Bhooridayaalundu
వీరాగ్రేసరుండాజిన్
Veeraagresarundaajin
విజయ ధ్వజంబదె!
Vijaya Dhvajambade!
2. ఆ హిమాచలమందు
2. Aa Himaachalamandu
నాటెక్కె మెత్తెను
Naatekke Meththenu
కాహళ ధ్వనియందుం
Kaahala Dhvaniyandun
గ్రందుకొనెనటన్!
Grandukonenatan!
సౌహార్థ భావమూని
Sauhaartha Bhaavamooni
జనాళిన్ బ్రోచుంగ
Janaalin Brochungga
ఆహా యీ యేసుప్రేమ
Aahaa Yee Yesuprema
యాశ్చర్యమైనది!
Yaashcharyamainadi!
3. ఆంధ్ర కాశ్మీర వంగ
3. Aandhra Kaashmeera Vangga
ఆ సేతువాసులు
Aa Sethuvaasulu
ఆంధ్రప్రాయులైయున్న
Aandhrapraayulaiyunna
యరణ్యవాసులున్
Yaranyavaasulun
బంధ విముక్తులౌచుం
Bandha Vimukthulauchun
ప్రభువైన యేసుని
Prabhuvaina Yesuni
బంధుర సేవచేయు
Bandhura Sevacheyu
వారలయ్యెదరు
Vaaralayyedaru
4. వీరెల్లం క్రీస్తునందు
4. Veerellan Kreesthunandu
విశ్వాసముంచిన
Vishvaasamunchina
ఆ రాజు వీరిన్ శాశ్వ
Aa Raaju Veerin Shaashva
తానంద సామ్రాజ్య
Thaananda Saamraajya
ధౌరేయులన్ గావించు
Dhaureyulan Gaavinchu
ఔర! యీ వార్తను
Aura! Yee Vaarthanu
స్ఫారానందంబుతోడం
Sphaaraanandambuthodan
జాటుదు రెవ్వరు!
Jaatudu Revvaru!
5. భేరీ తూరారవాది
5. Bheree Thooraaravaadi
గా రక్షావార్తను
Gaa Rakshaavaarthanu
దోరంపుం గోర్కెం జాటు
Dorampun Gorken Jaatu
మో దేశ సంఘమా!
Mo Desha Sangghamaa!
సౌరభ్యమౌ నీ ప్రేమ
Saurabhyamau Nee Prema
సారంబు జూపుము
Saarambu Joopumu
ధీరతన్ యుద్ధమందుం
Dheerathan Yuddhamandun
బోరాడి గెల్వుము
Boraadi Gelvumu