శరణుం జొచ్చితి యేసునాధుండ

Sharanun Jochchithi Yesunaadhunda

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

శరణుం జొచ్చితి యేసునాధుండ - శక్తిహీనతం గల్గె నా = దరణ మిమ్మిల

Sharanun Jochchithi Yesunaadhunda - Shakthiheenathan Galge Naa = Darana Mimmila

నెవ్వం బొందితి - దవ్వుసేయక కావవే ||శరణు||

Nevvan Bondithi - Davvuseyaka Kaavave ||Sharanu||

1. కరుణం జూడుము కన్న తండ్రివి - కల్మషం బెడంబాపవే = మరణ మొందక

1. Karunan Joodumu Kanna Thandrivi - Kalmashan Bedambaapave = Marana Mondaka

మున్ను నన్నిల - మార్పు నొందంగం జేయవే ||శరణు||

Munnu Nannila - Maarpu Nondanggan Jeyave ||Sharanu||

2. మొరను జెచ్చెర నాలకించుచు - మోము నా దెసం జూపవే = యురు

2. Moranu Jechchera Naalakinchuchu - Momu Naa Desan Joopave = Yuru

పదంబుల సేవం జేసెద - నుద్ధరించుము కూర్మితో ||శరణు||

Padambula Sevan Jeseda - Nuddharinchumu Koormitho ||Sharanu||

3. తామస క్రియలందు వాంఛలు- తాకకుండగం జేయవే = క్షేమమైన సువార్త

3. Thaamasa Kriyalandu Vaanchhalu- Thaakakundagan Jeyave = Kshemamaina Suvaartha

బోధల - సిద్ధపడి - విననీయవే ||శరణు||

Bodhala - Siddhapadi - Vinaneeyave ||Sharanu||

4. శ్రమలు చాల కల్గి యున్నను - సైంప నేర్పుము సత్కృపన్‌ = గమిలి పోయెడి

4. Shramalu Chaala Kalgi Yunnanu - Saimpa Nerpumu Sathkrupan = Gamili Poyedi

మాయ లోకపు - గాంతి నీరస మంచు నీ ||శరణు||

Maaya Lokapu - Gaanthi Neerasa Manchu Nee ||Sharanu||

Related Telugu Christian Songs