శరణం శరణం నా

Sharanan Sharanan Naa

Telugu by వెరి. రెవ. జి. యన్. సువర్ధరాజు • andhra-kraisthava-keerthanalu

శరణం శరణం నా ప్రియ యేసు

Sharanan Sharanan Naa Priya Yesu

చేరితి నీ దరినీ నా దేవ ||శరణం||

Cherithi Nee Darinee Naa Deva ||Sharanan||

1. ఎన్నో అఘము నొసరించితినీ

1. Enno Aghamu Nosarinchithinee

కన్నులే కానక చరియించితిని

Kannule Kaanaka Chariyinchithini

మన్నించుటకే పాత్రుడనుకాను

Manninchutake Paathrudanukaanu

కనికరపూర్ణుడా కృపనే చూపుమా ||శరణం||

Kanikarapoornudaa Krupane Choopumaa ||Sharanan||

2. చెడుగులతో జత చేసితిని

2. Chedugulatho Jatha Chesithini

అడుగులు తడబడి నడయాడితిని

Adugulu Thadabadi Nadayaadithini

ఇడుముల పాలై పతనము నొందితి

Idumula Paalai Pathanamu Nondithi

కడకే నా దరి శరణని చేరితి ||శరణం||

Kadake Naa Dari Sharanani Cherithi ||Sharanan||

3. రక్షణ నొసగి పావన పరచి

3. Rakshana Nosagi Paavana Parachi

అక్షయ భాగ్యము నొసగితివి

Akshaya Bhaagyamu Nosagithivi

మోక్షపదమ్మున నను నడిపితివి

Mokshapadammuna Nanu Nadipithivi

రక్షకుడా గైకొనుమా వందనం ||శరణం||

Rakshakudaa Gaikonumaa Vandanan ||Sharanan||

4. నమ్మితి నయ్య నీ చరణంబుల

4. Nammithi Nayya Nee Charanambula

నెమ్మది నొసగుము నా మదికి

Nemmadi Nosagumu Naa Madiki

నమ్మిన వారికి ఆదరమిచ్చెడి

Nammina Vaariki Aadaramichchedi

సమ్మతుడా నా సదముల విభూడా||శరణం||

Sammathudaa Naa Sadamula Vibhoodaa||Sharanam||

Related Telugu Christian Songs