శాశ్వత ప్రేమతో
Shaashwatha Prematho
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
Shaashwtha Prematho Nannu Preminchaavayyaa
కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)
Krupa Choopi Nannu Rakshinchaavayyaa (2)
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
Nee Prema Goppadi – Nee Jaali Goppadi
నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)
Nee Krupaa Goppadi – Naa Daya Goppadi (2)
అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
Anaathanainaa Nannu Vedaki Vachchaavu
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ||
Aadarinchi Kougilinchi Hatthukontivi (2) ||Nee Prema||
అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
Asthiramaina Lokamulo Thirigithinayyaa
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ||
Saatileni Yesayya Cherchukontivi (2) ||Nee Prema||
తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
Thalli Garbhamandu Nannu Choochiyuntivi
తల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ||
Thallilaa Aadarinchi Nadipincthivi (2) ||Nee Prema||
నడుచుచున్న మర్గమంత యోచించగా
Naduchuchunna Maargamantha Yochinchagaa
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2) ||నీ ప్రేమ||
Kaneetitho Vandanamulu Thelupudunayyaa (2) ||Nee Prema||
ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
Prabhuvu Cheyavalasinadi Aatankam Ledu
సమస్తము మేలుకై చేసిన దేవా (2) ||నీ ప్రేమ||
Samasthamu Melukai Chesina Devaa (2) ||Nee Prema||