సర్వోన్నతుండగు దేవుని

Sarvonnathundagu Devuni

Telugu by సీయోను గీతాలు • songs-of-zion

"మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును." ప్రకటన Revelation 22:1-(2)

"Mariyu Sphatikamuvale Merayunatti Jeevajalamula Nadi Devuni Yokkayu Gorrapilla Yokkayu Sinhaasanamunoddanundi Aa Pattanapu Raajaveedhi Madhyanu Pravahinchuta Aa Dootha Naaku Choopenu. Aa Nadi Yokka Eevalanu Aavalanu Jeevavrukshamundenu; Adi Nelanelaku Phalinchuchu Pandrendu Kaapulu Kaayunu. Aa Vrukshamu Yokka Aakulu Janamulanu Svasthaparachutakai Viniyoginchunu." Prakatana Revelation 22:1-(2)

"చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను. లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను." యెషయా Isaiah 41:19

"Chetluleni Mettalameeda Nenu Nadulanu Paarajesedanu. Loyalamadhyanu Ootalanu Ubukajesedanu. Aranyamunu Neetimadugugaanu Endina Nelanu Neetibuggalugaanu Chesedanu." Yeshayaa Isaiah 41:19

పల్లవి : సర్వోన్నత స్థలంబులో - దేవునికే మహిమ

Pallavi : Sarvonnatha Sthalambulo - Devunike Mahima

సర్వాధికారి యేసుని సిలువచే కలిగెను

Sarvaadhikaari Yesuni Siluvache Kaligenu

అనుపల్లవి : సర్వోన్నతుండగు దేవుని - సేవకులై యుండియు

Anu Pallavi : Sarvonnathundagu Devuni - Sevakulai Yundiyu

సర్వోన్నతుని చిత్తంబున - సర్వదా స్తుతియించెదము

Sarvonnathuni Chiththambuna - Sarvadaa Sthuthiyinchedamu

1. పరలోక యెరూషలేమున - పరిశుద్ధుల సంఘంబు

1. Paraloka Yerooshalemuna - Parishuddhala Sangghambu

మురియుచు భర్త యేసుకై - అరుదెంచుచుండెను

Muriyuchu Bhartha Yesukai - Arudenchuchundenu

పరిశుద్ధ పట్టణమందున - ప్రభు యేసు క్రీస్తుండు

Parishuddha Pattanamanduna - Prabhu Yesu Kreesthundu

ప్రకాశమానదీపమై - ప్రజ్వలించుచు నుండె

Prakaashamaanadeepamai - Prajvalinchuchu Nunde

|| సర్వోన్నత ||

|| Sarvonnatha ||

2. దేవుని సింహాసనమున - దేవుని మహిమలో

2. Devuni Sinhaasanamuna - Devuni Mahimalo

సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల

Suvarna Kireetambula Dharinchina Peddala

జీవుల మధ్యనుండెను - దేవుని గొర్రెపిల్ల

Jeevula Madhyanundenu - Devuni Gorrepilla

ఘనత మహిమ ప్రభావము - యుగయుగములు ఆయనకే

Ghanatha Mahima Prabhaavamu - Yugayugamulu Aayanake

|| సర్వోన్నత ||

|| Sarvonnatha ||

3. స్ఫటికంబు బోలినట్టి మెరయు - జీవ జలనది

3. Sphatikambu Bolinatti Merayu - Jeeva Jalanadi

పట్టణపు వీధులలో - ప్రవహించుచుండెను

Pattanapu Veedhulalo - Pravahinchuchundenu

స్ఫటికంపు నది కిరుప్రక్కల - జీవ ఫలవృక్షంబు

Sphatikampu Nadi Kiruprakkala - Jeeva Phalavrukshambu

స్వస్థత కలిగించును - వృక్షంపు యాకులు

Svasthatha Kaliginchunu - Vrukshampu Yaakulu

|| సర్వోన్నత ||

|| Sarvonnatha ||

4. బండలో నుండి నీటికాల్వల నిండుగ రప్పించెన్

4. Bandalo Nundi Neetikaalvala Ninduga Rappinchen

మెండైన నదుల నీళ్ళను - దండిగ పారించెన్

Mendaina Nadula Neellanu - Dandiga Paarinchen

బండైన క్రీస్తును చీల్చెను - ప్రభుదేవుండే మనకు

Bandaina Kreesthunu Cheelchenu - Prabhudevunde Manaku

నిండార నింపు నాత్మను - తండ్రి విధేయులన్

Nindaara Nimpu Naathmanu - Thandri Vidheyulan

|| సర్వోన్నత ||

|| Sarvonnatha ||

5. మెట్టల స్థలమందున - నదుల పారజేతున్

5. Mettala Sthalamanduna - Nadula Paarajethun

ఊటల నెన్నో లోయల - నుబుకంగ జేతును

Ootala Nenno Loyala - Nubukangga Jethunu

నీటిమడుగులుగా మార్చెద - నరణ్యము నంతటిని

Neetimadugulugaa Maarcheda - Naranyamu Nanthatini

నీటి బుగ్గలుగా చేతును - ఎండిన నేలను

Neeti Buggalugaa Chethunu - Endina Nelanu

|| సర్వోన్నత ||

|| Sarvonnatha ||

6. దావీదు పట్టణమందున - దావీదు సంతతిలో

6. Daaveedu Pattanamanduna - Daaveedu Santhathilo

దేవుని సర్వశక్తితో - జన్మించె యేసుండు

Devuni Sarvashakthitho - Janminche Yesundu

దావీదు తాళము కలిగి - తన సింహాసనమందు

Daaveedu Thaalamu Kaligi - Thana Sinhaasanamandu

తావిచ్చి చేర్చుకొనును - జయించువారిని

Thaavichchi Cherchukonunu - Jayinchuvaarini

|| సర్వోన్నత ||

|| Sarvonnatha ||

7. సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకు

7. Silvalo Maraninchenu Shree Yesu Naa Koraku

విలువైన రక్తము కార్చెను - మలినంబు బోగొట్టన్

Viluvaina Rakthamu Kaarchenu - Malinambu Bogottan

బలుడైన ఆత్మ శక్తితో - గెలిచె సమాధిని

Baludaina Aathma Shakthitho - Geliche Samaadhini

బలమిచ్చును పరిశుద్ధులకు - హల్లెలూయా పాడెదము

Balamichchunu Parishuddhalaku - Hallelooyaa Paadedamu

|| సర్వోన్నత ||

|| Sarvonnatha ||

Related Telugu Christian Songs