సర్వదేశములారా శ్రీ యేసే
Sarvadeshamulaaraa Shree Yese
సర్వదేశములారా - శ్రీ యేసే దేవుండు
Sarvadeshamulaaraa - Shree Yese Devundu
ఉర్వి నుత్సాహముతో - గురుస్తోత్రము జేయను రండి ||సర్వ||
Urvi Nuthsaahamutho - GuruSthothramu Jeyanu Randi ||Sarva||
1. ఆ ప్రభువే దేవుండు - అధికస్తోత్రార్హుండు
1. Aa Prabhuve Devundu - Adhikasthothraarhundu
భూప్రజలు నందరిని - బుట్టించిన భగవంతుండు ||సర్వ||
Bhooprajalu Nandarini - Buttinchina Bhagavanthundu ||Sarva||
2. మనము దేవుని వార - మును మరి యాయన ప్రజల
2. Manamu Devuni Vaara - Munu Mari Yaayana Prajala
మనయమునా ఘనప్రభువు - నెనరుతో మేపెడి గొఱ్ఱెలము ||సర్వ||
Manayamunaa GhanaPrabhuvu - Nenarutho Mepedi Gorrelamu ||Sarva||
3. కృతజ్ఞతార్పణలు - కొల్లగను జెల్లింప
3. KruthagnathaాRpanalu - Kollaganu Jellimpa
నాతని యావరణములో - నతి వినయముతోంజేరండి ||సర్వ||
Naathani Yaavaranamulo - Nathi Vinayamuthonjerandi ||Sarva||
4. ఆయన దయామయుండు - ఆయన కృపామయుండు
4. Aayana Dayaamayundu - Aayana KrupaాMayundu
ఆయన ప్రేమ సత్యం - బనవరతం నిజమే ||సర్వ||
Aayana Prema Sathyan - Banavarathan Nijame ||Sarva||
5. శుభనామం మదినుంచి - ప్రభునామం స్తుతియించి
5. Shubhanaaman Madinunchi - Prabhunaaman Sthuthiyinchi
ఘననామం బతిభక్తిన్ - అనయము గొలువుడి జనులారా ||సర్వ||
Ghananaaman Bathibhakthin - Anayamu Goluvudi Janulaaraa ||Sarva||
6. పితృపుత్రాత్మకును - ప్రియ మహిమ మగుగాక
6. Pithruputhraathmakunu - Priya Mahima Magugaaka
ఆదిని నుండినరీతి - ననవరతంబుండును గాక ||సర్వ||
Aadini Nundinareethi - Nanavarathambundunu Gaaka ||Sarva||