రేయింపగలు నీ పదసేవే

Reyimpagalu Nee Padaseve

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| రేయింపగలు నీ పదసేవే - యేసు ప్రభువా - చేయుటమేలు

Pa|| Reyimpagalu Nee Padaseve - Yesu Prabhuvaa - Cheyutamelu

సాటిలేని దేవుడ నీవె - నాదు కోట కొండయు నీవె

Saatileni Devuda Neeve - Naadu Kota Kondayu Neeve

1. పరమపురిలో వరదా నిరతం - దూతగణముల స్తుతులను సల్పి

1. Paramapurilo Varadaa Nirathan - Doothaganamula Sthuthulanu Salpi

పరిశుద్ధుడనుచు - పూజనొందె దేవుడ నీవె ||రేయి||

Parishuddhudanuchu - Poojanonde Devuda Neeve ||Reyi||

2. జిగటమన్నే మానవులంతా - పరమకుమ్మరి ప్రభుడవు నీవే

2. Jigatamanne Maanavulanthaa - Paramakummari Prabhudavu Neeve

సృష్టికర్తను మరచి జనులు - సృష్టిని పూజించుట తగునా ||రేయి||

Srushtikarthanu Marachi Janulu - Srushtini Poojinchuta Thagunaa ||Reyi||

3. పెంటకుప్పలనుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే

3. Pentakuppalanundi Deenula - Paikilepu Prabhudavu Neeve

గర్వమణచి గద్దెలు దింపి- ఘనులనైనా మేపవ గడ్డి

Garvamanachi Gaddelu Dimpi- Ghanulanainaa Mepava Gaddi

4. నరుల నమ్ముట కంటె నిజముగ - నీదు శరణం శరణం దేవా

4. Narula Nammuta Kante Nijamuga - Needu Sharanan Sharanan Devaa

రాజులను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము ||రేయి||

Raajulanu Dharanammutakante - Raajaraajavu Naakaashrayamu ||Reyi||

ర్. అగ్నివాసననంటకుండా - అబెద్నగోలతో నుండి నదేవా -

R. Agnivaasananantakundaa - Abednagolatho Nundi Nadevaa -

దానియేలును సింహపుబోనులో - ఆదుకొన్న నాధుడనీవె ||రేయి||

Daaniyelunu Sinhapubonulo - Aadukonna Naadhudaneeve ||Reyi||

6. పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు - వరము చేర్చు పదము నీవే

6. Paramagurudavu Prabhulaku Prabhudavu - Varamu Cherchu Padamu Neeve

అడుగుజాడల నడచిన - హనోకు - పరముచేరె ప్రాణముతోడ ||రేయి||

Adugujaadala Nadachina - Hanoku - Paramuchere Praanamuthoda ||Reyi||

7. మృతుల సహితము లేపినావు - మృతినిగెల్చి లేచినావు

7. Mruthula Sahithamu Lepinaavu - Mruthinigelchi Lechinaavu

మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతిలేపినావు ||రేయి||

Mruthulanella Lepevaadavu - Mruthyuvunu Mruthilepinaavu ||Reyi||

Related Telugu Christian Songs