రండి మానవులారా

Randi Maanavulaaraa

Telugu by జి జాన్‌ తాతయ్య • andhra-kraisthava-keerthanalu

రండి మానవులారా - రక్షకునిన - మృండి వేగము ప్రియులారా = రండి

Randi Maanavulaaraa - Rakshakunina - Mrundi Vegamu Priyulaaraa = Randi

పాపుల బ్రోచుటకు పర - మండలంబును విడిచి యీ భువి -మండలంబున

Paapula Brochutaku Para - Mandalambunu Vidichi Yee Bhuvi -Mandalambuna

కరుగుదెంచిన- మహాత్మున్‌ గనుగొని సుఖింపను ॥రండి॥

Karugudenchina- Mahaathmun Ganugoni Sukhimpanu ॥Randi॥

1. ఇలలో మానవులందరు - పలువిధ పాపా - శలలో మునిగి యుండిరి =

1. Ilalo Maanavulandaru - Paluvidha Paapaa - Shalalo Munigi Yundiri =

తులువయగు సాతాను చెడ్డ - వలను జిక్కినవారలన్‌ దన - బలముతో విడి

Thuluvayagu Saathaanu Chedda - Valanu Jikkinavaaralan Dana - Balamutho Vidi

పింప బ్రాణము - బలిగబెట్టిన ప్రభుని యొద్దకు ॥రండి॥

Pimpa Braanamu - Baligabettina Prabhuni Yoddaku ॥Randi॥

2. పరముండు నరులందరికై - మరణంబయ్యె - కరుణతోడను కొరతపై =

2. Paramundu Narulandarikai - Maranambayye - Karunathodanu Korathapai =

మరలి మూడవదినమునందున - మహిమతో నా ప్రభువులేచి - తెరవజేసెను

Marali Moodavadinamunanduna - Mahimatho Naa Prabhuvulechi - Theravajesenu

మోక్షమార్గము - శరణు జొచ్చినవారలకును ॥రండి॥

Mokshamaargamu - Sharanu Jochchinavaaralakunu ॥Randi॥

3. పాపభారంబు నుండి - విడుదలనొంద - ప్రాపుగోరినవారలు = ప్రాప

3. Paapabhaarambu Nundi - Vidudalanonda - Praapugorinavaaralu = Praapa

కుండగు క్రీస్తునాధుని - దాపుజేరి తపంబు జేసిన - పాపభారము దీసి శాంతిని

Kundagu Kreesthunaadhuni - Daapujeri Thapambu Jesina - Paapabhaaramu Deesi Shaanthini

గూర్చు - యా ప్రభు నొద్దకిపుడే ॥రండి॥

Goorchu - Yaa Prabhu Noddakipude ॥Randi॥

4. భావమందున దెలియుడి - మరలు నిత్య - జీవమార్గము గనుడీ = పావ

4. Bhaavamanduna Deliyudi - Maralu Nithya - Jeevamaargamu Ganudee = Paava

నుండగు క్రీస్తు మిమ్మును - పావనులుగా జేసి నూతన - జీవము నొసంగి పర

Nundagu Kreesthu Mimmunu - Paavanulugaa Jesi Noothana - Jeevamu Nosanggi Para

మున - జేర్చు మిమ్మును నిశ్చయముగా ॥రండి॥

Muna - Jerchu Mimmunu Nishchayamugaa ॥Randi॥

Related Telugu Christian Songs