రమ్ము నీ తరుణమిదే

Rammu Nee Tharunamide

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| రమ్ము! నీ తరుణమిదే - పిలచుచున్నాడు

Pa|| Rammu! Nee Tharunamide - Pilachuchunnaadu

నీ ప్రభువైన - యేసు నొద్దకు

Nee Prabhuvaina - Yesu Noddaku

1. జీవితమంతయు - వ్యర్థముగను దుఃఖముతోను

1. Jeevithamanthayu - Vyarthamuganu Duhkhamuthonu

గడుపుటయేల - వచ్చి ఆయన శరణు జొచ్చినచో

Gaduputayela - Vachchi Aayana Sharanu Jochchinacho

వాంఛతో నిన్ను -స్వీకరించున్ ||రమ్ము||।

Vaanchhatho Ninnu -Sveekarinchun ||Rammu||।

2. యిల్లు - ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును

2. Yillu - Dhanadhaanyamulu Kanabadu Bandhumithrulunu

గూడు విడిచి - నీవు పోయినచో - వెంటనీతో రారెవరు ||రమ్ము||

Goodu Vidichi - Neevu Poyinacho - Ventaneetho Raarevaru ||Rammu||

3. అందము మాయ - అస్థిరమే - దాని నమ్మకుము మోసగించును

3. Andamu Maaya - Asthirame - Daani Nammakumu Mosaginchunu

మరణము ఒకనాడు వచ్చును మరువకు - నీ ప్రభువును ||రమ్ము||

Maranamu Okanaadu Vachchunu Maruvaku - Nee Prabhuvunu ||Rammu||

4. మిన్ను క్రిందన్ - భూమి మీదన్ - మిత్రుడేసు నామముగాక

4. Minnu Krindan - Bhoomi Meedan - Mithrudesu Naamamugaaka

రక్షణ పొందు - దారిలేదు రక్షకుడేసే - మార్గము ||రమ్ము||

Rakshana Pondu - Daariledu Rakshakudese - Maargamu ||Rammu||

ర్. తీరని పాపవ్యాధులను - మారని నీదు - బలహీనతల్ ఘోర

R. Theerani Paapavyaadhulanu - Maarani Needu - Balaheenathal Ghora

సిలువలో - మోసితీర్చెన్ - గాయములచే బాగుపడన్ ||రమ్ము||

Siluvalo - Mositheerchen - Gaayamulache Baagupadan ||Rammu||

6. సత్యవాక్కును నమ్మి రమ్ము - నిత్యజీవనమును నీకిచ్చున్

6. Sathyavaakkunu Nammi Rammu - Nithyajeevanamunu Neekichchun

నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే - ప్రాయున్ ||రమ్ము||

Nee Peru Jeevapusthakamunandu Nijamuga Eenaade - Praayun ||Rammu||

Related Telugu Christian Songs