ప్రభు ప్రేమ తొలికేక

Prabhu Prema Tholikeka

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| ప్రభు ప్రేమ తొలికేక - హృదయంలో ప్రతిధ్వనియించే

Pa|| Prabhu Prema Tholikeka - Hrudayanlo Prathidhvaniyinche

పాపక్షమా యేసునిలో - శరణు నొసంగుచు కనిపించే

Paapakshamaa Yesunilo - Sharanu Nosangguchu Kanipinche

1. పాపవికారము పొడసూప - జీవితవిలువలు మరుగాయె

1. Paapavikaaramu Podasoopa - Jeevithaviluvalu Marugaaye

ఫలితముగా లోకములో - బ్రతుకుటయే నాగతియాయె

Phalithamugaa Lokamulo - Brathukutaye Naagathiyaaye

పలువురిలో కనబడలేకా - దాహముతో నేనొంటరిగా

Paluvurilo Kanabadalekaa - Daahamutho Nenontarigaa

బావికని పయనింప - నాదుని దర్శనమెదురాయే

Baavikani Payanimpa - Naaduni Darshanameduraaye

పావనుడు దాహముతో - జలమును ఇమ్మని ననుగోరె ప్ర

Paavanudu Daahamutho - Jalamunu Immani Nanugore Pra

2. జాతిని చూడని నేత్రముతో -పాపము హృదయముతో

2. Jaathini Choodani Nethramutho -Paapamu Hrudayamutho

జాలిని చాటించుచునే - తాకెను నామది వేదనతో

Jaalini Chaatinchuchune - Thaakenu Naamadi Vedanatho

జాష్యము చేయక తెమ్మనియే - దాచుకొనిన నాపాపమును

Jaashyamu Cheyaka Themmaniye - Daachukonina Naapaapamunu

జడియచునే తెలిపితిని -ప్రభు వెరిగిన నా నిజస్థితిని

Jadiyachune Thelipithini -Prabhu Verigina Naa Nijasthithini

జయమొందె నాతనువూ - సరిగ నుడితవని ప్రభు తెలుపా

Jayamonde Naathanuvoo - Sariga Nudithavani Prabhu Thelupaa

3. దేహమునే నాసర్వముగా - భావించుచు మది పూజింపా

3. Dehamune Naasarvamugaa - Bhaavinchuchu Madi Poojimpaa

దినదినము జీవితమూ - చావుగ మారిన కాలములో

Dinadinamu Jeevithamoo - Chaavuga Maarina Kaalamulo

దేవునిగా నా బంధువుగా - మరణ(ప్రవాహము చేధించి

Devunigaa Naa Bandhuvugaa - Marana(Pravaahamu Chedhinchi

దరిజేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించే

Darijerchi Deevinchi - Noothana Janma Prasaadinche

దయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించే (

Dayyaala Kuharamunu - Sthuthi Mandiramuga Roopinche (

4. పాపము దాగును నాబావి -లోతును చూచినదెవరు

4. Paapamu Daagunu Naabaavi -Lothunu Choochinadevaru

పోరాటవాటికయౌ - నా (బ్రతుకును ఎరిగినవారెవరు

Poraatavaatikayau - Naa (Brathukunu Eriginavaarevaru

పాపికిని పాపమునకునూ - భేదము చూపిన వారెవరూ

Paapikini Paapamunakunoo - Bhedamu Choopina Vaarevaroo

పాపిని కాపాడుటకు - సిలువను మోసిన వారెవరూ

Paapini Kaapaadutaku - Siluvanu Mosina Vaarevaroo

ప్రకటించె దైవకృప - తెరచెను జీవన జలనిధులు ప్ర

Prakatinche DaivaKrupa - Therachenu Jeevana Jalanidhulu Pra

ర్. ఘటముతో వెడలితి నొంటరిగా - పితరుల త్రానజనములకై

R. Ghatamutho Vedalithi Nontarigaa - Pitharula Thraanajanamulakai

కనబడెను బావికడ - రక్షణయూటల ప్రభుయేసు

Kanabadenu Baavikada - Rakshanayootala PrabhuYesu

కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములో

Kundanu Veedi Parugidithi Baavini Chekoni Hrudayamulo

ఘనమైన శుభవార్త - ఆతృతతో ప్రజలకు తెలుసా

Ghanamaina Shubhavaartha - Aathruthatho Prajalaku Thelusaa

గ్రామప్రజా కనుగొనిరి - విశ్వవిమోచకుడగు యేసున్ ప్ర

Graamaprajaa Kanugoniri - Vishvavimochakudagu Yesun Pra

Related Telugu Christian Songs