పరమపురి కల్పభూజ
Paramapuri Kalpabhooja
పరమపురి కల్పభూజ - నిరత భూనరుల పూజ
Paramapuri Kalpabhooja - Niratha Bhoonarula Pooja
యురుతరచిత మహిమతేజ - వరస్తుతి సల్పెదము రాజ ||పరమ||
Yurutharachitha Mahimatheja - VaraSthuthi Salpedamu Raaja ||Parama||
1. జనక సుత శుద్ధాత్మ - యను పేరిట యీ క్షణ
1. Janaka Sutha Shuddhaathma - Yanu Perita Yee Kshana
ఘనతర సంరక్ష ప్రేమ - ననిపి మము కనికరించు ||పరమ||
Ghanathara Sanraksha Prema - Nanipi Mamu Kanikarinchu ||Parama||
2. నీవే మా ప్రాపువంచు - నెరనమ్మి యుందు మంచు
2. Neeve Maa Praapuvanchu - Neranammi Yundu Manchu
భావంబున దలంచు వారిం - బావనులం జేయు సదా ||పరమ||
Bhaavambuna Dalanchu Vaarin - Baavanulan Jeyu Sadaa ||Parama||
3. కలుషంబులను హరింప - నిల సైతానును జయింప
3. Kalushambulanu Harimpa - Nila Saithaanunu Jayimpa
బలుమారు నిను దలంచు - బలము గల ప్రభుండ వీవే ||పరమ||
Balumaaru Ninu Dalanchu - Balamu Gala Prabhunda Veeve ||Parama||
4. ఈ లోక పాపనరులు - చాల నిను నమ్మి మరల
4. Ee Loka Paapanarulu - Chaala Ninu Nammi Marala
దూలిచే దారుణ సైతానును బడంద్రొక్కివేయు ||పరమ||
Dooliche Daaruna Saithaanunu Badandrokkiveyu ||Parama||
5. అల్ఫా ఓ మేగయును - నాద్యంతంబులును
5. Alphaa O Megayunu - Naadyanthambulunu
కల్పాంత స్థాయువైన - కర్తా కరుణించు మమును ||పరమ||
Kalpaantha Sthaayuvaina - Karthaa Karuninchu Mamunu ||Parama||