పరలోకమే నా స్వాస్థ్యము
Paralokame Naa Swaasthyamu
పరలోకమే నా స్వాస్థ్యము
Paralokame Naa Swaasthyamu
ఎపుడు గాంతునో (2)
Epudu Gaanthuno (2)
నా ప్రియ యేసుని
Naa Priya Yesuni
నేనెపుడు గాంతునో (2) ||పరలోకమే||
Nenepudu Gaanthuno (2) ||Paralokame||
ఆకలిదప్పులు దుఃఖము
Aakalidappulu Dukhamu
మనోవేదన లేదచ్చట (2)
Manovedana Ledachchata (2)
పరమ మకుటము పొందను
Parama Makutamu Pondanu
ప్రభు పాదముల చేరెదను (2) ||పరలోకమే||
Prabhu Paadamula Cheredanu (2) ||Paralokame||
సిలువ వేయబడితిని
Siluva VeyabaditHini
ఇక నే కాదు జీవించుట (2)
Ika Nekaadu Jeevinchuta (2)
ప్రభు యేసు మహిమ కొరకు
Prabhu Yesu Mahima Koraku
గురి గలిగి జీవింతును (2) ||పరలోకమే||
Guri Galigi Jeevinthunu (2) ||Paralokame||
నా పరుగు తుద ముట్టింప
Naa Parugu Thuda Muttimpa
నాకు కృపను మెండుగ నొసగును (2)
Naaku Krupanu Menduga Nosagunu (2)
విశ్వాస మార్గములో
Vishwaasa Maargamulo
విసుగక పరుగెత్తెదను (2) ||పరలోకమే||
Visugaka Parugetthedanu (2) ||Paralokame||
పరమ విశ్రాంతి పొంద
Parama Vishraanthi Ponda
పరలోకమందు చేరెదను (2)
Paralokamandu Cheredanu (2)
పగలు రాత్రచ్చట లేదు
Pagalu Raathrachchata Ledu
ప్రభువే దీపమై యుండును (2) ||పరలోకమే||
Prabhuve Deepamai Yundunu (2) ||Paralokame||
ప్రియుని పిలుపును విని
Priyuni Pilupunu Vini
నేను కూడా సిద్ధపడెదను (2)
Nenu Kooda Siddhapadedanu (2)
దినములు సమీపించగా
Dinamulu Sameepinchagaa
వాంఛయు అధికంబాయె (2) ||పరలోకమే||
Vaanchayu Adhikambaaye (2) ||Paralokame||