పాపము దలంచు సుమి
Paapamu Dalanchu Sumi
పాపము దలంచు సుమి - పశ్చా - త్తాపముం బొందు సుమి = దాపని
Paapamu Dalanchu Sumi - Pashchaa - Ththaapamun Bondu Sumi = Daapani
యేసుని పాదంబులబడి - పాపము వీడు సుమి ॥పాపము॥
Yesuni Paadambulabadi - Paapamu Veedu Sumi ॥Paapamu॥
1. పాపము చేయకు మో - యేసుని - గాయము రేపకుమి = పాయక
1. Paapamu Cheyaku Mo - Yesuni - Gaayamu Repakumi = Paayaka
పాపము చేసిన మనసా - కాయండు యేసు సుమి ॥పాపము॥
Paapamu Chesina Manasaa - Kaayandu Yesu Sumi ॥Paapamu॥
2. గంతులు వేయకుమో - యేసుని - చెంతకు జేరు సుమి = వింతంగం
2. Ganthulu Veyakumo - Yesuni - Chenthaku Jeru Sumi = Vinthanggan
గ్రీస్తుని రక్షణ్యామృత - బిందువు గోరు సుమి ॥పాపము॥
Greesthuni Rakshanyaamrutha - Binduvu Goru Sumi ॥Paapamu॥
3. ఈ ధరన్నమ్మకుమి - ఆత్మకు - శోధన లుండు సుమో = శోధన మాన్నెడు
3. Ee Dharannammakumi - Aathmaku - Shodhana Lundu Sumo = Shodhana Maannedu
క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుండు సుమో ॥పాపము॥
Kreesthunu Nammi Shraddhaga Nundu Sumo ॥Paapamu॥
4. తెగువ బోరాడు సుమి- రిపునకు - బెగ్గిలవద్దు సుమి = తెగువగు
4. Theguva Boraadu Sumi- Ripunaku - Beggilavaddu Sumi = Theguvagu
ప్రార్థన ఖడ్గమును బట్టి - పగతునిం గెలు సుమో ॥పాపము॥
Praarthana Khadgamunu Batti - Pagathunin Gelu Sumo ॥Paapamu॥
ర్. అంతము వచ్చు సుమి - రక్షణ - అంతలో వెదకు సుమి =అంత రంగు
R. Anthamu Vachchu Sumi - Rakshana - Anthalo Vedaku Sumi =Antha Ranggu
డగు క్రీస్తు రక్షకుని - చెంతను జేరు సుమి ॥పాపము॥
Dagu Kreesthu Rakshakuni - Chenthanu Jeru Sumi ॥Paapamu॥