పాడుదును క్రీస్తు పేర

Paadudunu Kreesthu Pera

Telugu by అల్లారి పెదవీరాస్వామి • andhra-kraisthava-keerthanalu

పాడుదును క్రీస్తు పేర పదము - నెంతో - వేడుదు నా దివ్యాగురు నివ్విధముం

Paadudunu Kreesthu Pera Padamu - Nentho - Vedudu Naa Divyaaguru Nivvidhamun

= జూడంజూడ మదిలో నెంతో - వేడుకగా వింత - టేడుం బోలినవా

= Joodanjooda Madilo Nentho - Vedukagaa Vintha - Tedun Bolinavaa

- లేండందు నహహా ||పాడుదును||

- Lendandu Nahahaa ||Paadudunu||

1... పెక్కుపాపములలోన మణంగి - నాదు -తక్కువ బుద్ధిచే నందణంగి దిక్కు

1... Pekkupaapamulalona Mananggi - Naadu -Thakkuva Buddhiche Nandananggi Dikku

గానక నుండు వేళ - చనుదెంచి మరల - [గ్రక్కున కరముం జూచి -

Gaanaka Nundu Vela - Chanudenchi Marala - [Grakkuna Karamun Joochi -

చక్కికిం జేర్చి ప్రోచె పాడుదును||

Chakkikin Jerchi Proche Paadudunu||

2. మోసపు లోక వాంఛలను - వట్టి - యాశలతోం గూడికొన్న కలలు =

2. Mosapu Loka Vaanchhalanu - Vatti - Yaashalathon Goodikonna Kalalu =

రోసితిం గాన వాని - యేసుతోం గూడుకొంటి - వీసమైనను లేమి - లేశము

Rosithin Gaana Vaani - Yesuthon Goodukonti - Veesamainanu Lemi - Leshamu

లేదనుస్వామి ||పాడుదును||

Ledanusvaami ||Paadudunu||

3. పాయ నెన్నటికిని వాసిగాం - బాస - త్రోయను త్రోయను యని చేసెగా =

3. Paaya Nennatikini Vaasigaan - Baasa - Throyanu Throyanu Yani Chesegaa =

రోయక న న్నావిభుండు - సాయమై రక్షించు నెపుడు - నా యనీతి భయములు

Royaka Na Nnaavibhundu - Saayamai Rakshinchu Nepudu - Naa Yaneethi Bhayamulu

మాని - యాయనే జయంజయమని ||పాడుదును||

Maani - Yaayane Jayanjayamani ||Paadudunu||

4. చాలు చాలు పాపమా నీ చెలిమి - నిత్య - కాలము గలిగించు మృత్యుకలిమి

4. Chaalu Chaalu Paapamaa Nee Chelimi - Nithya - Kaalamu Galiginchu Mruthyukalimi

= యేలికైన నాయిమ్మాను - యేలు నాయందు దయను - మేలిమి

= Yelikaina Naayimmaanu - Yelu Naayandu Dayanu - Melimi

నగుపరచినట్టి- జాలినేం గంటిం గాన ||పాడుదును||

Naguparachinatti- Jaalinen Gantin Gaana ||Paadudunu||

5. ధరలో దేనికి భయపడను - ఎట్టి - తరుణమైనను చేయి విడను =

5. Dharalo Deniki Bhayapadanu - Etti - Tharunamainanu Cheyi Vidanu =

కరుణామయుండు నన్ను - కరుణ మున్ను మరణమందును వాని -

Karunaamayundu Nannu - Karuna Munnu Maranamandunu Vaani -

శరణం నాశరణమని ||పాడుదును||

Sharanan Naasharanamani ||Paadudunu||

Related Telugu Christian Songs