ఓ ప్రేమగల యేసు
O Premagala Yesu
ఓ ప్రేమగల యేసు
O Premagala Yesu
ప్రేమించినావు మమ్ము
Preminchinaavu Mammu
స్మరించుచు స్తుతింతున్
Smarinchuchu Sthuthinthun
రక్షణ నిచ్చినావు (2)
Rakshana Nichchinaavu (2)
1. అద్భుత యాగమందు
1. Adbhutha Yaagamandu
అందరికై బలియై (2)
Andarikai Baliyai (2)
అందరి పాపములకు
Andari Paapamulaku
ప్రాయశ్చిత్తమైతివి (2) ||ఓ ప్రేమగల||
Praayashchitthamaithivi (2) ||O Premagala||
2. దాసులమై మేముండ
2. Daasulamai Memunda
మోషేను పంపితివి (2)
Moshenu Pampithivi (2)
చేసితివి స్వతంత్రులుగా
Chesithivi Svathanthrulugaa
నీ బాహుబలము తోడ (2) ||ఓ ప్రేమగల||
Nee Baahubalamu Thoda (2) ||O Premagala||
3. క్షమాపణానందముతో
3. Kshamaapanaanandamutho
సాగింపచేసి మమ్ము (2)
Saagimpachesi Mammu (2)
యాత్రలో మాకు తోడై
Yaathralo Maaku Thodai
విజయము నిచ్చితివి (2) ||ఓ ప్రేమగల||
Vijayamu Nichchithivi (2) ||O Premagala||
4. ఎడారి అడవిలోన
4. Edaari Adavilona
ఊటల నదులు నడిపి (2)
Ootala Nadulu Nadipi (2)
ఎండిన నేలనంత
Endina Nelanantha
పచ్చిక బయలు చేసెన్ (2) ||ఓ ప్రేమగల||
Pachchika Bayalu Chesen (2) ||O Premagala||
5. బాబెలు నుండి మమ్ము
5. Baabelu Nundi Mammu
విడిపించితివి నీవు (2)
Vidipinchithivi Neevu (2)
బంధకముల తెంచి
Bandhakamula Thenchi
తప్పు బోధ బాపినావు (2) ||ఓ ప్రేమగల||
Thappu Bodha Baapinaavu (2) ||O Premagala||
6. సహవాసమిచ్చి సంఘ
6. Sahavaasamichchi Sangha
అంగముల జేసినావు (2)
Angamula Jesinaavu (2)
సాక్షులను చేసి మమ్ము
Saakshulanu Chesi Mammu
శత్రువుల సిగ్గుపరచె (2) ||ఓ ప్రేమగల||
Shathruvula Sigguparache (2) ||O Premagala||
7. మహా ప్రేమ గల యేసు
7. Mahaa Prema Gala Yesu
మాకై చేసితివన్ని (2)
Maakai Chesithivanni (2)
ఘనపరతు హల్లెలూయ
Ghanaparathu Hallelooya
ఈ గొప్ప రక్షణ కొరకు (2) ||ఓ ప్రేమగల||
Ee Goppa Rakshana Koraku (2) ||O Premagala||