ఓ పాపి సంధించితివా
O Paapi Sandhinchithivaa
పల్లవి:
Pallavi:
ఓ పాపి సంధించితివా
O Paapi Sandhinchithivaa
నీ పాప విమోచకుని
Nee Paapa Vimochakuni
నీ పాపముల్ క్షమించి
Nee Paapamul Kshaminchi
నీ ప్రాణమునకు శాంతినొసగున్ ||ఓ పాపి||
Nee Praanamunaku Shaanthinosagun ||O Paapi||
1. బంధింపబడె - ప్రభువైన యేసు
1. Bandhimpabade - Prabhuvaina Yesu
విడుదల జేయ నిన్ను (2)
Vidudala Jeya Ninnu (2)
నిందను పొందెను
Nindanu Pondenu
పొంద నీ వానందము (2) ||ఓ పాపి||
Ponda Nee Aanandamu (2) ||O Paapi||
2. క్రీస్తు యేసు - నీ కొరకేడ్చె
2. Kreesthu Yesu - Nee Korakedche
గెత్సెమనే వనములో (2)
Getsemane Vanamulo (2)
వాత్సల్యముతో
Vaathsalayamutho
నిన్నానందింపజేయ (2) ||ఓ పాపి||
Ninnaanandimpajeya (2) ||O Paapi||
3. రక్షకుడు తీర్పుకై - నిలిచె
3. Rakshakudu Theerpukai - Niliche
అక్షయ జీవమీయ (2)
Akshaya Jeevameeya (2)
శిక్షను బొందె
Shikshanu Bonde
నిన్నానందింపజేయ (2) ||ఓ పాపి||
Ninnaanandimpajeya (2) ||O Paapi||
4. ప్రభువైన యేసు - తట్టుచున్నాడు
4. Prabhuvaina Yesu - Thattuchunnaadu
నీ హృదయ ద్వారమున్ (2)
Nee Hrudaya Dvaaramun (2)
అబ్బును శాంతి
Abbunu Shaanthi
తెరచిన హృదయమున్ (2) ||ఓ పాపి||
Therachina Hrudayamun (2) ||O Paapi||
5. జీవజలమిచ్చు - ప్రభువైన యేసు
5. Jeevajalamichchu - Prabhuvaina Yesu
దప్పిగొనియున్న నీకు (2)
Dappigoniyunna Neeku (2)
జీవితాంతము వరకు
Jeevithaanthamu Varaku
దప్పిగొన వే మాత్రము (2) ||ఓ పాపి||
Dappigona Ve Maathramu (2) ||O Paapi||
6. రక్షణ దుర్గమున నిన్నుంచి
6. Rakshana Durgamuna Ninnunchi
శత్రువును అణచివేసి (2)
Shathruvunu Anachivesi (2)
దక్షిణ హస్తముతో
Dakshina Hasthamutho
కప్పును - నిన్నెప్పుడు (2) ||ఓ పాపి||
Kappunu - Ninneppudu (2) ||O Paapi||
7. దేవుని స్వరము - వినుడి నేడే
7. Devuni Svaramu - Vinudi Nede
దైవపుత్రులౌదురు (2)
Daivaputhrulauduru (2)
సేవించుడి క్రీస్తుని
Sevinchudi Kreesthuni
జీవితములర్పించి (2) ||ఓ పాపి||
Jeevithamularpinchi (2) ||O Paapi||