ఓ కరుణానిధీ

O Karunaanidhee

Telugu by సీయోను గీతాలు • songs-of-zion

పల్లవి:

Pallavi:

ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు (2)

O Karunaanidhee, Mahaa PrabhuYesu (2)

నీవే సింహాసనాసీనుడవైతివి (2)

Neeve Sinhaasanaaseenudavaithivi (2)

1. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు (2)

1. Sathyasvaroopivi Parishuddhadavu (2)

దావీదు తాళము కల్గియున్నావు (2)

Daaveedu Thaalamu Kalgiyunnaavu (2)

నీవు తెరచినది మూయగలేరు (2)

Neevu Therachinadi Mooyagaleru (2)

బంధించినది తెరువగలేరెవ్వరు (2)

Bandhinchinadi Theruvagalerevvaru (2)

నీ మహాత్మ్యమదే (2)

Nee Mahaathmyamade (2)

2. ఏడు నక్షత్రములు నీచేత కలవు (2)

2. Edu Nakshathramulu Neechetha Kalavu (2)

దీప స్తంభముల మధ్య సంచరించెదవు (2)

Deepa Sthambhamula Madhya Sancharinchedavu (2)

జీవించువాడవు ఆది అంతములు (2)

Jeevinchuvaadavu Aadi Anthamulu (2)

రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా (2)

Rendanchula Khadgan Kaligina Prabhuvaa (2)

అదియే నీ ఘనత (2)

Adiye Nee Ghanatha (2)

3. అగ్నివంటి నేత్రములు కల్గి (2)

3. Agnivanti Nethramulu Kalgi (2)

అపరాపరంజి వంటి పాదములు కలిగి (2)

Aparaaparanji Vanti Paadamulu Kaligi (2)

దేవుని ఏడు ఆత్మలు కలిగి (2)

Devuni Edu Aathmalu Kaligi (2)

గ్రంధము తెరచే యోగ్యుడవీవే (2)

Grandhamu Therache Yogyudaveeve (2)

ధన్యుడవు నీవే (2)

Dhanyudavu Neeve (2)

4. నమ్మకమైన సత్యసాక్షియు (2)

4. Nammakamaina Sathyasaakshiyu (2)

సర్వసృష్టికి కర్తయైయుండి (2)

Sarvasrushtiki Karthayaiyundi (2)

నీతిమంతుడు బహుజ్వాలామయుడు (2)

Neethimanthudu Bahujvaalaamayudu (2)

దీర్ఘశాంతుడు శక్తిమంతుడు (2)

Deerghashaanthudu Shakthimanthudu (2)

ఆమెన్ అనువాడు (2)

Aamen Anuvaadu (2)

5. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు (2)

5. Ellaru Prabhuni Sthuthinchedaru (2)

సాగిల పడెదరు కృతజ్ఞులై (2)

Saagila Padedaru Kruthajnyulai (2)

ఆశ్చర్యక్రియలు చేసితివంచు (2)

Aashcharyakriyalu Chesithivanchu (2)

ప్రభువా నీవే అగమ్యుడవంచు (2)

Prabhuvaa Neeve Agamyudavanchu (2)

నిను కొనియాడెదము

Ninu Koniyaadedamu (2)

Related Telugu Christian Songs