నుతి సేయను లేవే

Nuthi Seyanu Leve

Telugu by వంతగాని పరదేశి • andhra-kraisthava-keerthanalu

నుతి సేయను లేవే - యో మనసా - నుతింజేయను లేవే = 88D -

Nuthi Seyanu Leve - Yo Manasaa - Nuthinjeyanu Leve = 88D -

హితమతిం బ్రోచెడి - సుతుని జనకుని - శుద్దాత్మునిం ||నుతి||

Hithamathin Brochedi - Suthuni Janakuni - Shuddaathmunin ||Nuthi||

1... సూర్యుని కాంతి - సొంపగు పంటలు - సుకాలక్షేమముల్ - శోభిలు

1... Sooryuni Kaanthi - Sompagu Pantalu - Sukaalakshemamul - Shobhilu

గేహమున్ = ఆర్య సాంగత్యము - నైశ్వర్యముల నిల - ననుభవింపవె నీవా -

Gehamun = Aarya Saanggathyamu - Naishvaryamula Nila - Nanubhavimpave Neevaa -

యాఢ్యుని పేర్మిని ||నుతి||

Yaadhyuni Permini ||Nuthi||

2!

2. దురితము లందె - దుర్గతి నున్న - కురుతర (ప్రేమను - బరమార్ధ

2. Durithamu Lande - Durgathi Nunna - Kuruthara (Premanu - Baramaardha

మోయను = వరపుత్రు నొసంగండె - వందనీయుండు ప్రభు - మరిమరి

Moyanu = Varaputhru Nosanggande - Vandaneeyundu Prabhu - Marimari

మొక్కు మా - పరమోపకారిని ||నుతి||

Mokku Maa - Paramopakaarini ||Nuthi||

3. జీవము జ్ఞానము - జీవము నొసంగెడు - పావనాత్మను నీకై - పంపిన

3. Jeevamu Jnyaanamu - Jeevamu Nosanggedu - Paavanaathmanu Neekai - Pampina

దేవు డు = కేవల దోష స్వ -భావము మార్చండె - సేవ జేయుమ నీవా -

Devu Du = Kevala Dosha Sva -Bhaavamu Maarchande - Seva Jeyuma Neevaa -

పావనమూర్తికి

Paavanamoorthiki

4. కరములు పదముల్ - కనకాదు లన్నియు - స్వరమును చిత్తము - స్థిరమగు

4. Karamulu Padamul - Kanakaadu Lanniyu - Svaramunu Chiththamu - Sthiramagu

ప్రేమయు = మరి నీదు హృదయము - పరమాత్ము సేవకై - పరిపూర్ణముగ

Premayu = Mari Needu Hrudayamu - Paramaathmu Sevakai - Paripoornamuga

నిచ్చి - ప్రణుతించు మాయనన్ ||నుతి||

Nichchi - Pranuthinchu Maayanan ||Nuthi||

Related Telugu Christian Songs