నేనున్న స్థితిలోనే
Nenunna Sthithilone
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
Nenunna Sthithilone Santhrupthini Kaliginchu
ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు
Emunna Lekunna Neekorake Brathikinchu
అ.పకష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
A.Pakashtaalu Edurainaa Naa Yaathranu Saaginchu
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
Nashtaalalonainaa Sthuthicheyuta Nerpinchu
లోకములో నీకొరకు జ్యోతిగ నను వెలిగించు
Lokamulo Neekoraku Jyothiga Nanu Veliginchu
రెండవ రాకడవరకు విడువక నను నడపించు ||కష్టాలు||
Rendava Raakadavaraku Viduvaka Nanu Nadapinchu ||Kashtaalu||
నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు
Naa Dinamula Parimaanan Lekkinchuta Nerpinchu
నాలోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు ||కష్టాలు||
Naalopala Sthira Hrudayan Noothanamuga Puttinchu ||Kashtaalu||
సరియగు త్రోవను నడువ కట్టలను బోధించు
Sariyagu Throvanu Naduva Kattalanu Bodhinchu
సమయోత జ్ఞానమును దయచేసి దీవించు ||కష్టాలు||
Samayotha Gnaanamunu Dayachesi Deevinchu ||Kashtaalu||