నీ ప్రేమ బాటలో
Nee Prema Baatalo
నీ ప్రేమ బాటలో నే పయనించెద నా యేసురాజా
Nee Prema Baatalo Ne Payanincheda Naa Yesuraajaa
నీ వెలుగు బాటలో నిన్ను వెంబడించెద నా యేసురాజా
Nee Velugu Baatalo Ninnu Vembadincheda Naa Yesuraajaa
నన్ను వీడవు ఎడబాయవు
Nannu Veedavu Edabaayavu
నీదు కృపతో నన్ను ఆవరింతువు
Needu Krupatho Nannu Aavarinthuvu
1. బెత్లేహేము వరకు వెళ్లి వచ్చెద
1. Bethlehemu Varaku Velli Vachcheda
సత్యమైన త్యాగం గమనించెద
Sathyamaina Thyaagam Gamanincheda
ఒలీవల కొండపై ఉపదేశం - నా దేవా
Oleevala Kondapai Upadesham - Naa Devaa
నీలో ఫలియించెడి జీవితమే - నా యేసురాజా
Neelo Phaliyinchedi Jeevithame - Naa Yesuraajaa
2. యూదయ అడవిలో సంచరించెద
2. Yoodaya Adavilo Sancharincheda
శోధన జయించుట నేర్చుకొందును
Shodhana Jayinchuta Nerchukondunu
ప్రతి శోధన నాకై జయించితివి - నా దేవా
Prathi Shodhana Naakai Jayinchithivi - Naa Devaa
ప్రతి పాపపు బంధం తెంపితివి - నా యేసురాజా
Prathi Paapapu Bandham Thempithivi - Naa Yesuraajaa
3. గెత్సెమనే తోటలో ప్రార్ధించెద
3. Gethsemane Thotalo Praardhincheda
సత్యదైవ చిత్తముకు లోబడెద
Sathyadaiva Chiththamuku Lobadeda
గొల్గొతా ధారలు నా కొరకే - నా దేవా
Golgothaa Dhaaralu Naa Korake - Naa Devaa
కలువరిలో కలుషము బాపితివి - నా యేసురాజా
Kaluvarilo Kalushamu Baapithivi - Naa Yesuraajaa
4. ఖాళీ సమాధిలో తొంగి చూచెద
4. Khaalee Samaadhilo Thongi Choocheda
ఖాలీ పాత్రగ నేజేరెద
Khaalee Paathraga Nejereda
నిండైన జీవం నేకోరెద - నా దేవా
Nindaina Jeevam Nekoreda - Naa Devaa
మెండైన ప్రేమకై జీవించెద - నా యేసురాజా
Mendaina Premakai Jeevincheda - Naa Yesuraajaa