నీ నామ గానమే ప్రాణాధారం
Nee Naama Gaaname Praanaadhaaram
నీ నామ గానమే ప్రాణాధారం
Nee Naama Gaaname Praanaadhaaram
నీ వాక్య ధ్యానమే నా జీవనాధారము (2)
Nee Vaakya Dhyaaname Naa Jeevanaadhaaramu (2)
ప్రభో అందుకో నా స్తుతుల్
Prabho Anduko Naa Sthuthul
కరుణించి కాపాడి నను బ్రోవుమా (2) ||నీ నామ||
Karuninchi Kaapaadi Nanu Brovumaa (2) ||Nee Naama||
నీవు లేని నాదు బ్రతుకు నీరు లేని ఏరు తుదకు
Neevu Leni Naadu Brathuku Neeru Leni Eru Thudaku
నీవు నా బ్రతుకులో నింప రావా జీవ జలము (2)
Neevu Naa Brathukulo Nimpa Raavaa Jeeva Jalamu (2)
పాప జగతిలోన నేను పడి ఉండిన వేళలో (2)
Paapa Jagathilona Nenu Padi Undina Velalo (2)
పావనాత్మ చేర రావా పరమ జీవము ఇవ్వ నాకు (2) ||నీ నామ||
Paavanaathma Chera Raavaa Parama Jeevamu Ivva Naaku (2) ||Nee Naama||
కలుషములను కడిగి వేయు కరుణామయుడవని తెలిసి
Kalushamulanu Kadigi Veyu Karunaamayudavani Thelisi
కరములు జోడించి నిన్ను కాపాడమని వేడెద (2)
Karamulu Jodinchi Ninnu Kaapaadamani Vededa (2)
సిలువ రాజా నాదు హృదయ సింహాసనము పైన
Siluva Raajaa Naadu Hrudaya Simhaasanamu Paina
చిరకాలము ఏల రావా శ్రీ యేసునాథా (2) ||నీ నామ||
Chirakaalamu Ela Raavaa Shree Yesunaathaa (2) ||Nee Naama||